ED Manish Sisodia : స్వంత ఫోన్లు ధ్వంసం చేసిన సిసోడియా
ఇతరుల ఫోన్లతో ఢిల్లీ లిక్కర్ స్కాం
ED Manish Sisodia Updates : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైలు నుంచి కోర్టుకు హాజరైన మాజీ డిప్యూటీ సీసోడియా పై కీలక వ్యాఖ్యలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. శుక్రవారం కోర్టుకు సంచలన విషయాలు తెలిపింది. తనకు సంబంధించిన స్వంత ఫోన్లను ధ్వంసం చేశాడని , ఇతరుల ఫోన్లతో మొత్తం కథ నడిపాడని ఆరోపించింది ఈడీ(ED Manish Sisodia Updates).
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ముసాయిదా రూపకల్పనతో ఎక్సైజ్ కుంభకోణం ప్రారంభమైందని , దీనిని ఆప్ నేత మనీష్ సిసోడియా తో పాటు ఇతరులు కలిసి చేశారని ఈడీ ఢిల్లీ కోర్టుకు స్పష్టం చేసింది. మద్యం పాలసీని కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హోల్ సేల్ వ్యాపారం చేసేందుకు కుట్రలో భాగంగానే అమలు చేశారని ఈడీ ఆరోపించింది. హోల్ సేల్ లాభంలో 12 శాతం ప్రైవేట్ సంస్థలకు నిర్ణయించాలని ప్రజల నుండి ఎలాంటి సూచన రాలేదని ఈడీ తరపున హాజరైన జోహెబ్ హుస్సేన్ కోర్టుకు తెలిపారు.
కేవలం కొంత మంది వ్యక్తులకు చట్ట విరుద్ధమైన ప్రయోజనాలను కల్పించే విధంగా పాలసీని రూపొందించేలా ప్లాన్ చేశారని పేర్కొన్నారు. సౌత్ కార్టెల్ తో పాటు విజయ్ నాయర్ , ఇతరులతో కలిసి ఈ విధానం వెనుక కుట్ర జరిగందని ఈడీ తరపు న్యాయవాది ఆరోపించారు.
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కూడిన సౌత్ గ్రూప్ 9 జోన్లపై పట్టు సాధించిందని , ఢిల్లీ లోని ఎక్సైజ్ వ్యాపారంలో తీవ్రమైన వాటాదారుగా మారిందని కోర్టుకు తెలిపింది. సిసోడియా(ED Manish Sisodia) తరపున సౌత్ గ్రూప్ తో విజయ్ నాయర్ చర్చలు జరిపారని సంచలన ప్రకటన చేసింది.
Also Read : సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ఖాయం – సుకేష్