Sanjay Raut : శివ‌సేన ఎవ‌రికీ త‌ల‌వంచ‌దు – రౌత్

ఆరు తీర్మానానాలు ఆమోదించామ‌న్న ఎంపీ

Sanjay Raut : మహారాష్ట్ర‌లో సంక్షోభం కొన‌సాగుతున్న వేళ అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut).

ఆయ‌న ఎక్క‌డా తొట్రు ప‌డ‌టం లేదు. ముందు నుంచీ ఒక‌టే చెబుతూ వ‌స్తున్నారు. శివ‌సేన ఎవ‌రితో రాజీ ప‌డ‌ద‌ని, త‌ల‌వంచే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

శ‌నివారం మీడియాతో సంజ‌య్ రౌత్ మాట్లాడారు. త‌మ పార్టీ స‌మావేశంలో ఆరు తీర్మానాల‌ను ఆమోదించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

శివ‌సేన పార్టీ చీఫ్ , సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే అధ్య‌క్ష‌త‌న స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఏర్పాటైంద‌ని ఈ సంద‌ర్భంగా ఏం చేయాలనే దానిపై సుదీర్ఘంగా చ‌ర్చ చోటు చేసుకుంద‌న్నారు.

శివ‌సేన బ‌ల‌గం పెద్ద‌ద‌ని, దానిని ఎవ‌రూ క‌దిలించ లేర‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రు క‌దిలించాల‌ని ప్ర‌య‌త్నం చేసినా అది అగ్ని గుండంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు.

ఎవ‌రు ద్రోహులో ఎవ‌రు నిజాయితీ ప‌రులో ప్ర‌జ‌లే తేలుస్తార‌ని చెప్పారు. శివ‌సేన బాలా సాహెబ్ ఠాక్రే హిందూత్వ భావ‌జాలాన్ని అనుస‌రిస్తుంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

. స‌మైక్య మహారాష్ట్ర సిద్దాంతంతో రాజీ ప‌డ‌ద‌ని చెప్పారు సంజ‌య్ రౌత్(Sanjay Raut). ప్ర‌జాస్వామ్య దేశంలో అసెంబ్లీ వ‌ర‌కు స్పీకరే అంతిమ న్యాయ నిర్ణేత అని ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా, లేదా ప్ర‌య‌త్నం చేసినా చివ‌ర‌కు వారికి అప‌జ‌యం త‌ప్ప మ‌రొక‌టి మిగ‌ల‌ద‌న్నారు.

అస్సాంలోని గౌహ‌తిలో ఉంటే రాజ‌కీయం ఎలా చేస్తారంటూ రౌత్ ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికీ తాము రెబ‌ల్స్ కు చాన్స్ ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

వారు త‌మ త‌ప్పు తెలుసుకుని త‌మ‌తో క‌లిసి వ‌స్తే ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని పేర్కొన్నారు సంజ‌య్ రౌత్.

Also Read : మ‌రాఠా సంక్షోభంపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

Leave A Reply

Your Email Id will not be published!