Marine Le Pen : ప్రపంచ వ్యాప్తంగా ప్రధానంగా యూరప్ దేశాలలో తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది ఫ్రాన్స్ ( ఫ్రెంచ్ ) అధ్యక్ష పదవికి చెందిన ఎన్నికలు. ఇప్పటి వరకు ప్రెసిడెంట్ గా ఉన్న ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండో సారి 58 శాతం ఓట్లతో విజయం సాధించారు.
ఆయన చివరి వరకు పోరాడారు. కానీ ఒకానొక సమయంలో మాక్రాన్ ఓటమి చెందడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఫ్రెంచ్ తీవ్రవాద నాయకురాలిగాఉన్న మెరైన లే పెన్(Marine Le Pen) ఆఖరు దాకా గట్టి పోటీని ఇచ్చింది.
ఒక రకంగా చప్పాలంటే మాక్రాన్ కు ముచ్చెమటలు పట్టించింది. ఈ సందర్భంగా విజయం సాధించిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ను ప్రత్యేకంగా అభినందించింది. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తానని స్పష్టం చేసింది.
ఓటమి అనంతరం లే పెన్ మాట్లాడింది. తాను ఎన్నికల్లో ఓటమి పాలైనా ప్రభుత్వంతో పోరాటం చేస్తానని, ప్రజా సమస్యల కోసం గళం ఎత్తుతానని ప్రకటించింది. ఆమె ఇప్పటికే తీవ్రవాద నాయకురాలిగా పేరొందారు.
58 ఏళ్ల లే పెన్ కు 42 శాతం ఓట్లు రాగా మాక్రాన్ కు 58 శాతం ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య ఓట్ల శాతం తేడా 16 శాతం. ఓడి పోయినంత మాత్రాన తాము ఫ్రెంచ్ ను వదులుకునే ప్రసక్తి లేదని ప్రకటించింది.
అయినా మా పోరాటం ఇప్పటితో ఆగి పోదు ఇంకా కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది. లే పెన్ శ్రామిక తరగతి ఓటర్లలో మెజారిటీని సాధించింది. కానీ విజయం అంచుల దాకా వచ్చి ఓటమి పాలైంది. కానీ ప్రతి ఓటమి తనకు ఓ పాఠమేనని చెప్పింది.
Also Read : చైనాతో స్నేహం కొంప ముంచింది