Mark Zuckerberg Losses : జుక‌ర్ బ‌ర్గ్ కు షాక్ ఫాలోవ‌ర్లు గుడ్ బై

ఏకంగా 119 మిలియ‌న్ల మంది రాం రాం

Mark Zuckerberg Losses : సోష‌ల్ మీడియాలో టాప్ లో కొన‌సాగుతున్న ఫేస్ బుక్ సంస్థ సిఇఓగా కొన‌సాగుతున్న మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ కు ఈ ఏడాది 2022 కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న‌కు భారీ ఎత్తున ఫాలోవ‌ర్స్ ఉన్నారు. తాజాగా రాను రాను ఫేస్ బుక్ ప‌ట్ల ఆద‌ర‌ణ త‌గ్గుతోంద‌న్న ప్ర‌చారం జోరందుకుంది.

ఫేస్ బుక్ ను మేటాగా మార్చేశాక డౌన్ ఫాల్ అవుతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా ప్లాట్ ఫార‌మ్ ల‌లో లెక్క‌కు మించి వ‌స్తున్నాయి. టెక్నాల‌జీ మారుతున్నా ఇంకా ఫేస్ బుక్ టాప్ లో కొన‌సాగుతోంది. మ‌రో వైపు వాట్సాప్ కూడా స‌ద‌రు సంస్థ‌దే.

ప్ర‌పంచ వ్యాప్తంగా డేటా చౌర్యం కొన‌సాగుతోంద‌ని, మ‌నకు సంబంధించిన స‌మాచారం పూర్తిగా ఫేస్ బుక్ , వాట్సాప్ సేక‌రించి పెట్టుకుంద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌ధానంగా ఇటీవ‌ల వాట్సాప్ కు ప్ర‌త్యామ్నాయంగా ఎదుగుతున్న టెలిగ్రామ్ సిఇఓ సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టాడు.

తాజాగా ఆయ‌న కామెంట్స్ చేసిన కొన్ని రోజుల త‌ర్వాత ఫేస్ బుక్ సిఇఓ జుకెర్ బ‌ర్గ్ కు(Mark Zuckerberg) బిగ్ షాక్ త‌గ‌ల‌డం విశేషం. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 119 మిలియ‌న్ల మంది ఫేస్ బుక్ ఫాలోవ‌ర్ల‌ను కోల్పోయాడు. ఇది విస్తు పోయేలా చేసింది టెక్ దిగ్గ‌జాల‌ను. దీంతో అత‌డి అనుచ‌రుల సంఖ్య 10,000 కంటే త‌క్కువ‌కు ప‌డి పోయింది.

మ‌రో వైపు బంగ్లాదేశ్ ర‌చ‌యిత్రి త‌స్లీమా న‌స్రీన్ కూడా దాదాపు 9,00,000 మంది అనుచ‌రుల‌ను కోల్పోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి పోయింది.

దీనిపై ఆరా తీస్తున్నామ‌ని మెటా ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. ఎక్క‌డ పొర‌పాటు జ‌రిగింద‌నే దానిపై రీసెర్చ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Also Read : ఐ ఫోన్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్

Leave A Reply

Your Email Id will not be published!