Maryam Nawaz : పాకిస్తాన్ మాజీ ప్రధాని కూతురు మరియమ్ నవాజ్ షరీఫ్ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో చోటు చేసుకున్న పరిణామాలపై ఆమె స్పందించారు.
జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ భారత్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు మరియమ్ షరీఫ్. పాకిస్తాన్ ను విడిచి వెంటనే ఇండియాకు వెళ్లి పోవాలని సూచించారు.
ఈ దేశంలో ఉంటూ ఇంకో దేశం గురించి మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం మరియమ్ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ కి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
నిన్నటి దాకా ప్రగల్భాలు పలికిన ఇమ్రాన్ ఖాన్ ఓడి పోతానని తెలిసి చిలుక పలుకులు పలుకుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. పదవి కోసం నానా అగచాట్లు పడుతున్నాడని, దొంగ ఏడ్పులు ఏడుస్తున్నాడంటూ మండిపడ్డారు మరియమ్ నవాజ్ షరీఫ్(Maryam Nawaz).
అధికారం పోతుందని ఆయనకు తెలుసు. విదేశీ శక్తుల పేరుతో నాటకాలు ఆడుతున్నాడంటూ ఆరోపించారు. ఆయనకు స్వంత పార్టీపై పట్టు లేదన్నారు.
అవిశ్వాస తీర్మానం పెడితే తప్పకుండా ఓడి పోవడం ఖాయమన్నారు. అందుకే దానిని తప్పించు కునేందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనీయకుండా వాయిదా వేస్తూ వస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరియం నవాజ్ షరీఫ్.
కాగా ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇండియాను ఆకాశానికి ఎత్తేశాడు. ఆ దేశాన్ని ఏ శక్తి ఆపలేదన్నారు. భారత్ పటిష్టంగా ఉందన్నారు. అక్కడి ఆర్మీ జోక్యం చేసుకోదన్నాడు.
Also Read : రష్యా రాకెట్ దాడిలో 35 మంది మృతి