Megastar Chiranjeevi : గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్ వెనుక మ‌సూద్ భాయ్

స‌ల్లూ భాయ్ కి థ్యాంక్స్ చెప్పిన చిరంజీవి

Megastar Chiranjeevi : మెగ‌స్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ ప్ర‌స్తుతం వ‌సూళ్ల‌ను తిర‌గ రాస్తోంది. బాక్సాఫీసు వ‌ద్ద దుమ్ము రేపుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆశించిన దానికంటే ఎక్కువ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది. ఇప్ప‌టికే రూ. 100 కోట్ల క్ల‌బ్ లోకి చేర‌బోతోంది. ఈ త‌రుణంలో ఫుల్ జోష్ లో ఉన్నార‌ను మెగాస్టార్ చిరంజీవి.

శనివారం సోష‌ల్ మీడియా వేదిక‌గా చిరంజీవి (Megastar Chiranjeevi) త‌న స్పంద‌న‌ను తెలియ చేశారు. త‌న‌తో పాటు న‌టించినందుకు ప్ర‌త్యేకించి బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ ను అభినందించారు. పొడిగించిన అతిథి పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగి పోయినందుకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. తెలుగు సినిమాలో త‌న అరంగేట్రం చేస్తూ ఈ స్టార్ గాడ్ ఫాద‌ర్ లో చిరంజీవికి న‌మ్మ‌క‌మైన మ‌సూద్ భాయ్ పాత్ర‌ను పోషించాడు.

ఇదిలా ఉండ‌గా చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ న‌టించిన పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం 2019లో మ‌ల‌యాళంలో వ‌చ్చిన లూసిఫ‌ర్ చిత్రానికి తెలుగు రీమేక్ . మ‌ల‌యాళంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ తెలుగు రీమేక్ చిత్రం అక్టోబ‌ర్ 5న విడుద‌లైంది. అన్ని చోట్లా మంచి టాక్ తో దూసుకు పోతోంది. వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.

స‌ల్మాన్ ఖాన్ న‌ట‌న అద్భుత‌మ‌ని పేర్కొన్నాడు. సినిమా విజ‌యం సాధించ‌డం వెనుక మ‌సూద్ బాయ్ ఉన్నాడ‌ని కితాబు ఇచ్చాడు. ఆ మ‌సూద్ భాయ్ ఎవ‌రో కాదు నా సోద‌రుడు స‌ల్మాన్ ఖాన్ అని పేర్కొన్నాడు చిరంజీవి. ఈ అద్భుత విజ‌యం నాది కాదు నీది అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు స‌ల్మాన్ ఖాన్ పై.

Also Read : క‌లెక్ష‌న్ల వేట‌లో మెగాస్టార్ గాడ్ ఫాద‌ర్

Leave A Reply

Your Email Id will not be published!