Apple Layoffs : యాపిల్ కంపెనీలో కొలువుల కోత

ఆర్థిక మాంద్యం పేరుతో లే ఆఫ్స్

Apple Layoffs : ప్ర‌పంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం అన్ని రంగాల‌ను ప్ర‌భావితం చేస్తోంది. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, మీడియా, వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌ల‌లో ప‌ని చేస్తున్న వేలాది మంది వేటుకు గుర‌వుతున్నారు. టెస్లా చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ రూ. 4,400 కోట్ల‌కు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేశాక తొలిసారిగా 9 వేల మందిని తొలించాడు.

మ‌స్క్ ను ఆద‌ర్శంగా తీసుకున్న మిగ‌తా కంపెనీలు ఉద్యోగుల‌ను తీసి వేసే ప‌నిలో ప‌డ్డాయి. గూగుల్ 10 వేల మందిని, ఫేస్ బుక్ మెటాలో 10 వేల మందిని, మైక్రో సాఫ్ట్ లో 10 వేల మందిని తొల‌గించాయి. మీడియా కంపెనీల‌లో 6 వేల మందికి పైగా తొల‌గించాయి అంత‌ర్జాతీయ ప‌రంగా.

తాజాగా ప్రముఖ ఫోన్ల త‌యారీ కంపెనీ యాపిల్(Apple Layoffs) కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆర్థిక మాంద్యం పేరుతో సిబ్బందిని తొల‌గించే ప‌నిలో ఫోక‌స్ పెట్టింది. కంపెనీలోని రిటైల్ టీమ్ ల‌లో ప‌ని చేస్తున్న సిబ్బందిని త‌గ్గించాల‌ని నిర్ణ‌యించింది. దీంతో త‌మ ఉద్యోగాలు ఉంటాయో ఉండ‌వోన‌న్న ఆందోళ‌న మొద‌లైంది.

గ్లోబ‌ల్ కంపెనీల‌న్నీ లే ఆఫ్స్ కు తెర తీస్తే యాపిల్ మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చింది ఇప్ప‌టి దాకా. తాజాగా బ్లూమ్ బ‌ర్గ్ సంచ‌ల‌న విష‌యాన్ని వెలుగులోకి తెచ్చింది. పెద్ద ఎత్తున యాపిల్ కూడా కొలువుల‌పై కోత విధించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

Also Read : ట్విట్ట‌ర్ బ్లూ బ‌ర్డ్ లోగో మార్పు

Leave A Reply

Your Email Id will not be published!