Wipro Layoffs : విప్రోలో భారీగా ఉద్యోగుల తొలగింపు
పనితీరు బాగోలేదని 450 ఇంటి బాట
Wipro Layoffs : ప్రపంచ ఆర్థిక మాంద్యం పేరుతో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే మరికొన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో ఎంప్లాయిస్ ను భారీ ఎత్తున సాగనంపుతున్నాయి. మొదటగా టెస్లా సిఇఓ , చైర్మన్ ఎలోన్ మస్క్ దీనికి శ్రీకారం చుట్టాడు. రూ. 4,400 కోట్లతో కొనుగోలు చేసిన ట్విట్టర్ లో 9 వేల మందికి పైగా తీసి వేశాడు.
ఆపై గూగుల్ 12 వేలు, మైక్రోసాఫ్ట్ 10 వేలు, ఫేస్ బుక్ మెటా లో 10 వేల మంది, అమెజాన్ లో 18 వేల మంది ఇంటి బాట పట్టారు. తాజాగా ఇదే బాటలో మరో ఐటీ కంపెనీ కూడా చేరింది. భారత్ కు చెందిన దిగ్గజ ఐటీ సంస్థగ పేరొందిన విప్రో ప్రేమ్ జీ సారథ్యంలోని విప్రోలో తాజాగా 450 మంది ఫ్రెషర్స్ ను తొలగించింది. భారీ ఎత్తున లేఆఫ్స్ కు(Wipro Layoffs) శ్రీకారం చుట్టాయి కంపెనీలు.
దీంతో ఉద్యోగులు ఎప్పుడు తమ జాబ్స్ ఉంటాయో ఉండవోనన్న ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా విప్రో కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే క్లయింట్లు వ్యయ నిర్ణయాలను ఆలస్యం చేయడంతో ప్రస్తుత త్రైమాసికంలో కీలకమైన ఐటీ సేవల వ్యాపారంలో ఆదాయం తగ్గే ఛాన్స్ ఉందని విప్రో హెచ్చరించింది.
ఇదిలా ఉండగా శిక్షణ ఇచ్చాక కూడా పదే పదే అసెస్ మెంట్ లలో ఉద్యోగులు పేలవంగా పని చేశారంటూ ఆరోపించింది సంస్థ. ఎంట్రీ లెవల్ ఉద్యోగులను తొలగించినట్లు(Wipro Layoffs) ప్రకటించింది విప్రో. ఇదే సమయంలో అమెజాన్ , గూగుల్ , స్విగ్గీ వంటి సంస్థలు కూడా ట్రైనర్లను తీసి వేస్తున్నట్లు వెల్లడించాయి.
Also Read : తెలంగాణకు రూ. 21 వేల కోట్లు – కేటీఆర్