Matthew Hayden : శాంస‌న్ చేయ‌లేనిది పాటిదార్ చేశాడు

ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ మాథ్యూ హేడ‌న్

Matthew Hayden : ఐపీఎల్ ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో ల‌క్నోకు చుక్క‌లు చూపించాడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స బెంగ‌ళూరు ఆట‌గాడు ర‌జత్ పాటిదార్. గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో సంజూ శాంస‌న్ చేయ‌లేని ప‌నిన‌ని పాటిద‌ర్ చేశాడంటూ ఎద్దేవా చేశాడు.

వ‌చ్చీ రావ‌డంతోనే అటాకింగ్ మొద‌లు పెట్ట‌డాన్ని ప్ర‌శంసించాడు. 12 ఫోర్లు 7 భారీ సిక్స‌ర్ల‌తో ఏకంగా 112 ప‌రుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు పాటిదార్. ఆర్సీబీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

ప్లే ఆఫ్ మ్యాచ్ లో సెంచ‌రీ సాధించిన మొద‌టి అన్ క్యాప్ ప్లేయ‌ర్ గా పేరు పొందాడు ర‌జ‌త్ పాటిదార్. ర‌జ‌త్ ఆడిన ఆట తీరుపై తాజా, మాజీ క్రికెట‌ర్లు ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపిస్తున్నారు.

కేవ‌లం 54 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని స‌త్తా చాటాడంటూ కితాబు ఇచ్చారు మాథ్యూ హేడ‌న్(Matthew Hayden). సంజూ శాంస‌న్ మంచి ప్లేయ‌ర్ కాద‌న‌లేం. కానీ అత‌డు ఆడ‌లేని షాట్స్ ను ర‌జ‌త్ పాటిదార్ ఆడాడు. చేసి చూపించాడ‌ని పేర్కొన్నాడు.

ఆఫ్ సైడ్ ద్వారా కూడా అద్భుత‌మైన షాట్స్ ఆడాడు. ఇదో అద్భుత‌మైన ఇన్నింగ్స్ గా అభివ‌ర్ణించాడు మాథ్యూ హేడ‌న్. గుజ‌రాత్ తో ఆడిన స‌మ‌యంలో సంజూ శాంస‌న్ 26 బంతులు ఆడి 5 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 47 ర‌న్స్ చేశాడు.

సాయి కిషోర్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ర‌జ‌త్ పాటిదార్ అద్భుత‌మైన సెంచ‌రీని ప్ర‌శంసించాడు. తాను చూసిన ఇన్నింగ్స్ ల‌లో గొప్ప‌ది పాటిదార్ ఇన్నింగ్స్ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ ప‌ఠాన్.

ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ లో నేను చూసిన అద్భుత‌మైన సెంచ‌రీ అంటూ కితాబు ఇచ్చాడు ఆర్సీబీ స్కిప్ప‌ర్ డుప్లెసిస్ త‌న స‌హ‌చ‌ర ఆటగాడు ర‌జ‌త్ పాటిదార్ గురించి.

Also Read : బౌల‌ర్ల వైఫ‌ల్యం రాజస్తాన్ కు శాపం

Leave A Reply

Your Email Id will not be published!