Zabihullah Mujahid : పాకిస్తాన్ లోనే మౌలానా మ‌సూద్ అజ‌ర్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన తాలిబ‌న్

Zabihullah Mujahid : జైషే మ‌హ్మ‌ద్ చీఫ్ మౌలానా మ‌సూద్ అజ‌ర్ ఆఫ్గ‌నిస్తాన్ లో ఉన్నాడంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌ల్ని కొట్టి పారేశారు తాలీబ‌న్ ప్ర‌తినిధి జ‌బివుల్లా ముజాహిద్ కొట్టి పారేశారు. మ‌రో వైపు ల‌ష్క‌రే తోయిబా ఆప‌రేష‌న‌ల్ క‌మాండ‌ర్ సాజిద్ మీర్ పై పాకిస్తాన్ చ‌ర్య‌లు తీసుకుంది.

ఇప్ప‌టి దాకా చ‌ని పోయిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఇది పాకిస్తాన్ పై నిరంత‌ర ఒత్తిడి కార‌ణంగా జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. మౌలానా మ‌సూద్ అజర్ త‌మ వ‌ద్ద ఉన్నాడ‌ని పాకిస్తాన్ చేసిన కామెంట్స్ వ‌న్నీ అబ‌ద్దాల‌నేన‌ని పేర్కొన్నారు జ‌బివుల్లా(Zabihullah Mujahid).

మౌలానా మసూద్ అజ‌ర్ వాస్త‌వానికి పాకిస్తాన్ లో ఉన్నాడ‌ని ఆఫ్గ‌నిస్తాన్ స్థానిక మీడియా టోలో న్యూస్ తెలిపింది. జైష్ ఎ మ‌హ్మ‌ద్ (జేఎం) చీఫ్ మౌలానా మ‌సూద్ అజ‌ర్ ను అరెస్ట్ చేయాలంటూ పాకిస్తాన్ ఆఫ్గ‌నిస్తాన్ కు లేఖ రాసింది.

మౌలానా మ‌సూద్ ఆఫ్గ‌నిస్తాన్ లోని నంగ‌ర్ హ‌ర్ , క‌న్హ‌ర్ ప్రాంతాల్లో ఉన్న‌ట్లు పేర్కొంది పాకిస్తాన్. అయితే ఈ లేఖ‌పై ఇస్లామిక ఎమిరేట్ ప్ర‌తినిధి జ‌బివుల్లా ముజాహిద్ స్పందించింది. జైష్ ఎ మ‌హ్మ‌ద్ గ్రూప్ నాయ‌కుడు ఆఫ్గనిస్తాన్ లో లేడన్నారు.

ఇది పాకిస్తాన్ లో ఉండే సంస్థ‌. అత‌డికి మాకు సంబంధం లేదు. ఆయ‌న ఇక్క‌డ లేనే లేడ‌ని స్ప‌ష్టం చేశారు జ‌బివుల్లా.

కాగా ఇలాంటి ఆరోప‌ణ‌లు కాబూల్ , ఇస్లామాబాద్ మ‌ధ్య సంబంధాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌వ‌ని తాలిబ‌న్ నేతృత్వంలోని విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం పాకిస్తాన్ మాను కోవాల‌ని సూచించారు జ‌బీవుల్లా ముజాహిద్.

Also Read : చైనాతో భార‌త్ చ‌ర్చ‌ల‌పై స‌స్పెన్స్

Leave A Reply

Your Email Id will not be published!