Mayawati Dimple Yadav : కేంద్ర బడ్జెట్ పై మాయావతి ఫైర్
సామాన్యుల బడ్జెట్ లో ఊసేది
Mayawati Dimple Yadav : పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం కుమారి మాయావతి , సమాజ్ వాది ఎంపీ డింపుల్ యాదవ్(Mayawati Dimple Yadav) నిప్పులు చెరిగారు. బుధవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై స్పందించారు. ఇది కేవలం ఎన్నికల బడ్జెట్ గా తయారు చేశారని ఆరోపించారు.
బడ్జెట్ పూర్తిగా అసంపూర్తిగా ఉందని పేర్కొన్నారు. ఇది సామాన్యులను పట్టించు కోలేదన్నారు. ఇది కేవలం ఎన్నికలలో లబ్ది పొందేందుకు చేసిన ప్రయత్నం అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా బడ్జెట్ ను కూడా పూర్తిగా చదవలేక పోవడాన్ని తప్పు పట్టారు. అనారోగ్యం కారణంగా తాను చదవలేక పోతున్నానంటూ బడ్జెట్ ను పూర్తి చేయకుండానే కూర్చున్నారు.
దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కుమారి మాయవతి, డింపుల్ యాదవ్. ట్విట్టర్ వేదికగా ఈ ఇద్దరు నాయకురాళ్లు కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. గతంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఇప్పటి వరకు ఎన్ని కేటాయించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్ లో ప్రకటనలు, వాగ్ధానాలు , వాదనలు, ఆశల వర్షం కురిపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం , పేదరికాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు మాయావతి, డింపుల్ యాదవ్. ప్రతి ఏటా 2 కోట్ల జాబ్స్ భర్తీ చేస్తామని చెప్పిన మోదీ దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.ఇది పూర్తిగా నిరాశకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : వ్యవసాయ రంగానికి రుణ సాయం