NV Ramana : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయే ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రపంచ ఖ్యాతి సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ఏర్పాటు వల్ల నగరానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు వస్తుందని చెప్పారు సీజేఐ(NV Ramana ).
భవన నిర్మాణానికి గచ్చిబౌలిలో విలువైన భూమి కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు రమణ. హైటెక్స్ లోని ఐకియా వెనుక ఉన్న 3.7 ఎకరాల్లో అర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి జస్టిస్ సీజేఐ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రమణ ప్రసంగించారు. ఇప్పటికే హైదరాబాద్ లో అంతర్జాతీయ మధ్య వర్తిత్వ కేంద్రం కొనసాగుతోందన్నారు. సింగపూర్ లాగానే హైదరాబాద్ లోని ఈ కేంద్రం కూడా ఖ్యాతి గడిస్తుదన్నారు.
ఈ భవనం ఇదే సమయానికి పూర్తి అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు భారత సర్వోన్నత న్యాయమూర్తి. ఐఏఎంసీ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ కు చెప్పగానే ఒప్పుకున్నారని తెలిపారు.
అంతకంటే స్పీడ్ గా ఓ తాత్కాలిక కేంద్రాన్ని కూడా ఇచ్చారని కొనియాడారు. ఈ కేంద్రం ఏర్పాటు వల్ల పలు సమస్యలకు పరిష్కారం కలుగుతోందన్నారు సీజేఐ ఎన్వీ రమణ(NV Ramana ).
ఈ కొత్త భవన నిర్మాణానికి రూ. 50 కోట్లు ఖర్చు చేయడం సంతోషంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమా కోహ్లీ , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.
Also Read : పాదయాత్రకు శ్రీకారం సర్కార్ పై పోరాటం