Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపా నడ్డాతో పాటు రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.
పార్టీ అగ్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి(Modi )వివరించినట్లు సమాచారం. ఉత్తర ప్రదేశ్ , గోవా, మణిపూర్ రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించి పీఎంతో సమావేశమయ్యారు.
పార్టీ కేంద్ర పరిశీలకులు ఆయా రాష్ట్రాలకు సోమవారం వెళ్లనున్నారు. తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాలలో పంజాబ్ ను ఆప్ గెలుచుకుంది. ఇక గోవా, ఉత్తర ప్రదేశ్, మణిపూర్ , ఉత్తరాఖండ్ లో మరోసారి బీజేపీ కొలువు తీరింది.
ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించి సీఎం అభ్యర్థులను ఎంపిక చేసింది. మణిపూర్ విషయంలో కొంత ఆలస్యం జరిగింది. ఇవాళ సీఎంగా రెండోసారి ఎన్. బీరేన్ సింగ్ ను ప్రకటించింది.
యూపీలో సీఎంగా యోగి, ఉత్తరాఖండ్ కు ధామీనే ఎంపిక చేసింది. గోవాలో ఉత్కంఠకు తెర దించింది. మణిపూర్ లో బీరేన్ సింగ్ తో పాటు బిశ్వజిత్ సింగ్ ,ఖేమ్ చంద్ పోటీ పడ్డారు చివరకు సింగ్ వైపు హై కమాండ్ మొగ్గు చూపింది.
గోవాలో ప్రమోద్ సావంత్ , విశ్వజిత్ రాణేల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో సావంత్ కు ఛాన్స్ ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు బీజేపీ హైకమాండ్ తీసుకున్న కీలక నిర్ణయాల గురించి ప్రధాని మోదీతో వివరించే ప్రయత్నం చేస్తున్నారు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్.
ఇక యూపీలో యోగి కన్ ఫర్మ్ అయినప్పటికీ కేబినెట్ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
Also Read : కావాలని బద్నాం చేస్తున్నారు