Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ ప్రాథమిక కీ విడుదల

ఏపీ మెగా డీఎస్సీ ప్రాథమిక కీ విడుదల

Mega DSC : ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు బుధవారంతో విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు జూన్‌ 6 నుంచి 28వరకు జరిగిన వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షల ప్రిలిమినరీ కీలను విడుదల చేశారు. వీటితో పాటు రెస్పాన్స్‌ షీట్‌లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఎస్సీ (Mega DSC) కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ కీపట్ల అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు తగిన ఆధారాలతో జులై 11లోగా సమర్పించాలని సూచించారు. జూన్‌ 29 నుంచి జులై 2వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Mega DSC – తాజాగా అందుబాటులోకి తెచ్చిన కీలు ఇవే..

పీజీటీ విభాగంలో కామర్స్, ఇంగ్లిష్, హిందీ, ఫిజికల్ సైన్స్, సంస్కృతం, సోషల్, తెలుగు
స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్
ఎస్జీటీ విభాగంలో ఎస్జీటీ జనరల్, ఎస్జీటీ (స్పెషల్ హెచ్‌హెచ్ -వినికిడి లోపం ఉన్నవారు), ఎస్జీటీ (స్పెషల్ వీహెచ్ – దృదృష్టి లోపం ఉన్నవారికి ప్రత్యేక ఎస్‌జీటీ)
టీజీటీ విభాగంలో ఇంగ్లిష్, హిందీ, ఫిజికల్ సైన్స్, సైన్స్ (విజ్ఞాన శాస్త్రం), సోషల్, తెలుగు
ఇంగ్లిష్‌ ప్రావీణ్యత పరీక్ష (లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌)
పీఈటీ- హెచ్‌హెచ్ (వినికిడి లోపం ఉన్నవారికి), పీఈటీ – వీహెచ్ (దృష్టి లోపం ఉన్నవారికి ), ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (PET) పరీక్షలకు సంబంధించి అన్ని మాధ్యమాల కీ, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read : Minister Kandula Durgesh: రాష్ట్రంలో మరిన్ని బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు వచ్చేలా చూస్తాం – మంత్రి దుర్గేష్‌

Leave A Reply

Your Email Id will not be published!