Mekapati Gautham Reddy : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Gautham Reddy )హఠాన్మరణం చెందారు. ఆయనకు 50 ఏళ్లు. గుండె పోటు రావడంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ 8.45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.
గౌతమ్ రెడ్డిని(Mekapati Gautham Reddy )ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబీకులు, సన్నిహితులకు సమాచారం అందించారు.
ఆయన తండ్రి మాజీ ఎంపీ. ప్రముఖ పారిశ్రామికవేత్త మేకపాటి రాజ మోహన్ రెడ్డి కుమారుడు. 1971 నవంబర్ 2న పుట్టారు. గౌతం రెడ్డి ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ యూనివర్శిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు.
2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటర్ అయ్యారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు సార్లు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఇదిలా ఉండగా వారం రోజుల పాటు దుబాయిలో జరిగిన బిజినెస్ ఎక్స్ పోలో పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకు వచ్చే అంశంపై పలు సంస్థలతో చర్చలు జరిపారు.
కొన్ని సంస్థలతో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ఆదివారమే దుబాయి నుంచి ఇక్కడికి చేరుకున్నారు. జనవరి 22న ఆయన కరోనా బారిన పడ్డారు.
ఇవాళ ఉదయం గుండె పోటు రావడంతో ఆస్పత్రిలో చేరినా ఫలితం లేక పోయింది. మరణ వార్త విన్న వెంటనే సీఎం జగన్ రెడ్డి హైదరాబాద్ కు బయలు దేరారు. ఏపీలో తీవ్ర విషాదం అలుముకుంది గౌతం రెడ్డి మరణంతో.
Also Read : ఏపీలో జనవరి నుంచే పీఆర్సీ అమలు