Mera Rang De Basanti : దేశం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవ వీరుడు సర్దార్ షహీద్ భగత్ సింగ్.
కోట్లాది మందికి ఆయన ఆరాధ్య దైవం. యువతకు స్పూర్తి. జీవితం అంటే సుఖం కాదని అది సామాజిక బాధ్యత అని చాటి చెప్పిన యోధుడు.
ఉరి శిక్ష ఖాయమని తెలిసి చిరునవ్వుతో ఉరి కొయ్యలను ముద్దాడిన పోరాట స్పూర్తి భగత్ సింగ్ ది.
దేశ విముక్తి కోసం తన విలువైన కాలాన్ని ఏనాడూ కోల్పోలేదు .చెరసాలను అధ్యయనశాలగా మార్చుకున్నాడు. ప్రపంచాన్ని చదివాడు.
ఆయనకు విప్లవ కారుడు రాంప్రసాద్ భిస్మిల్ రాసిన మేరా రంగ్ దే బసంతీ చోలా (Mera Rang De Basanti )పాటంటే భగత్ సింగ్ కు చచ్చేంత ఇష్టం. ఉరి తీసే కంటే ముందు ఆ పాటను పాడాడు.
అదే – మేరా రంగ్ దే బసంతీ చోలా, ఇసీ రంగ్ మే రంగ్ కే శివానే, మాకా బంధన్ ఖోలా, మేరా రంగ్ దే బసంతీ చోలా(Mera Rang De Basanti ).
యహీ రంగ్ హల్దీ ఘాటీ మే, ఖుల్ కర్కే థా ఖేలా, నవ్ బసంత్ మే , భారత్ కే హిత్ వీరోంకా యహ్ మేలా. మేరా రంగ్ దే బసంతీ చోలా.
దీనిని పంజాబ్ లో కొత్తగా కొలువు తీరిన సీఎం భగవంత్ మాన్ మరోసారి గుర్తుకు తీసుకు వచ్చాడు. పంజాబ్ లోనే కాదు దేశంలో విప్లవాన్ని ప్రేమించే వాళ్లు.
పోరాటం చేస్తున్న వాళ్లు, న్యాయం, ధర్మం కోసం ఉద్యమిస్తున్న వాళ్లు నిత్యం పాడుకునే పాట మేరా రంగ్ దే బసంతీ చోలా .1931లో మార్చి 23తో ముగిసింది భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్ ల పోరాట జీవితం.
వాళ్లు లేక పోయినా నేటికీ వారందించిన స్పూర్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. భగత్ సింగ్ పై ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో ఈ పాటను వాడారు.
Also Read : ఆర్ఆర్ఆర్‌పై ఉమైర్ సంధు ప్రశంసలు