Meta Threads : ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్స్
త్వరలో యాప్ లాంచ్
Meta Threads : ఫేస్ బుక్ మెటా సిఇఓ జుకర్ బర్గ్ సంచలన ప్రకటన చేశాడు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ అయిన మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ (పిట్టకూత)కు ప్రత్యామ్నాయంగా తాము యాప్ ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా యావత్ టెక్ ప్రపంచం కుదుపునకు లోనైంది. ఇప్పటికే ఎన్నో సామాజిక మాధ్యమాలు ట్విట్టర్ కు వ్యతిరేకంగా, ప్రత్యామ్నాయంగా వచ్చాయి. కానీ నిలబడలేక పోయాయి. కానీ ఈసారి ఫేస్ బుక్ మెటా మాత్రం తగ్గేదే లేదంటోంది. దీంతో టెక్నాలజీలో యుద్దం తప్పదని తేలి పోయింది.
ఇదిలా ఉండగా ట్విట్టర్ ను గత ఏడాది భారీ ధర వెచ్చించి కొనుగోలు చేశాడు టెస్లా చైర్మన్ , ట్విట్టర్ సిఇవో ఎలాన్ మస్క్(Elon Musk). ఆయన ప్రస్తుతం వరల్డ్ లోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్నాడు. టేకోవర్ చేసుకున్న వెంటనే టాప్ మేనేజ్ మెంట్ లో పలువురిని తొలగించాడు. ఆపై ప్రక్షాళన ప్రారంభించాడు. వేలాది మందిని ఇంటికి పంపించాడు. పని చేసే వాళ్లకు మాత్రమే ఛాన్స్ అని ప్రకటించాడు. ఇదే సమయంలో కీలక మార్పులు కూడా చేశాడు.
కేవలం ట్విట్టర్ కు పోటీగా ప్రత్యేకంగా యాప్ ను తయారు చేయడం జరిగిందని, దాని పేరు థ్రెడ్స్ అని ప్రకటించాడు మెటా సిఇఓ మార్క్ జుకెర్ బర్గ్. దీంతో ఎలోన్ మస్క్ వర్సెస్ జుకెర్ బర్గ్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొన బోతోందన్నమాట.
Also Read : Niharika Chaitanya Divorce : నిహారికా చైతన్య వీడిన బంధం