ఐపీఎల్ 16వ సీజన్ లో దిగ్గజ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. శుక్రవారం ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ కొనసాగనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్ 57వది. పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది హార్దిక్ పాండ్యా సేన. ఇప్పటి దాకా 11 మ్యాచ్ లు ఆడింది. 8 మ్యాచ్ లలో గెలుపొందింది.
3 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. 16 పాయింట్లతో నెంబరర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇక ముంబై ఇండియన్స్ అనూహ్యంగా పుంజుకుంది.
ఆరంభంలో ఓటమి పాలైనా ఆ తర్వాత వరుస విజయాలతో గెలుపు బాట పట్టింది. ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్ లు ఆడింది. 6 మ్యాచ్ లలో గెలుపొందగా 5 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో ముంబై , గుజరాత్ టైటాన్స్ జట్లు బలంగా ఉన్నాయి. చివరి మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది.
సూర్య కుమార్ యాదవ్ తుఫాన్ ఇన్నింగ్స్ తో దంచి కొట్టాడు. ఇక గుజరాత్ టైటాన్స్ ఆఖరు మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై గెలుపొందింది.
ప్లే ఆఫ్ రేసులో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ నెంబర్ 1లో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ 2వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ 3వ ప్లేస్ లో కొనసాగుతున్నాయి.