ICT Cyber Shikshaa : ఐసీటీతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం

సైబ‌ర్ శిక్షా ప్రాజెక్టు ద్వారా శిక్ష‌ణ

ICT Cyber Shikshaa : టెక్నాల‌జీ రంగం శ‌ర‌వేగంగా మారుతోంది. రోజు రోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ త‌రుణంలో ప్ర‌త్యేకించి అన్ని కంపెనీలు భ‌ద్ర‌త (సెక్యూరిటీ) విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి.

కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నాయి. కానీ అవ‌స‌ర‌మైన నిపుణులు లేక పోవ‌డం అన్న‌ది ఆయా కంపెనీల‌ను ఎక్కువ‌గా వేధిస్తోంది. ఈ త‌రుణంలో ఐటీ సెక్టార్ లో టాప్ కంపెనీగా పేరున్న మైక్రోసాఫ్ట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ప్ర‌త్యేకించి సైబ‌ర్ సెక్యూరిటీ రంగంలో రానున్న 3 ఏళ్ల‌లో ల‌క్ష‌ల ఉద్యోగాలు రానున్నాయ‌ని గుర్తించింది. ఇదే విష‌యాన్ని మైక్రోసాఫ్ట్ ఫిలాంత్రోపీస్ చీఫ్ కేట్ బెన్సన్ ప్ర‌క‌టించారు.

ఇందుకు సంబంధించి ఐసీటీ అకాడ‌మీ భాగ‌స్వామ్యంతో సైబ‌ర్ శిక్షా(ICT Cyber Shikshaa) కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌మ‌ని తెలిపారు. దేశంలోని 7 రాష్ట్రాల‌లో 400 మంది అధ్యాప‌కులు, 6 వేల మంది ఉన్న‌త విద్యావంతుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఐసీటీ, మైక్రోసాఫ్ట్ మ‌ధ్య సైబ‌ర్ శిక్షా కార్య‌క్ర‌మానికి సంబంధించి ఒప్పందం జ‌రిగింది. 2025 నాటికి వ‌ర‌ల్డ్ వైడ్ గా 35 ల‌క్ష‌ల మంది అవ‌స‌రం ఉంటుంద‌న్నారు. ఒక్క ఇండియా లోనే 15 ల‌క్ష‌ల మంది దాకా కావాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

కాగా ఇంత డిమాండ్ ఉన్నా అందుకు అవ‌స‌ర‌మైన నైపుణ్యం క‌లిగిన వారు లేర‌న్నారు. సైబ‌ర్ సెక్యూరిటీలో మ‌హిళ‌ల‌కు బాగా డిమాండ్ ఉంద‌ని, వీరిలో 70 శాతం మంది మ‌హిళ‌లు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని ఐసీడీ సిఇఓ బాల‌చంద్ర‌న్ వెల్ల‌డించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలోని 1,200 విద్యా సంస్థ‌ల‌తో శిక్ష‌ణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నామ‌ని తెలిపారు. ఈ సంస్థ‌ల్లో తెలంగాణ రాష్ట్రంలో 86 ఉన్నాయ‌ని చెప్పారు.

Also Read : రిటైర్డ్ పైల‌ట్ల‌కు ఎయిర్ ఇండియా ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!