Microsoft Meta Layoffs : ఫేస్ బుక్..మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్

భారీ ఎత్తున ఉద్యోగులు తొల‌గింపు

Microsoft Meta Layoffs : ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక మంద‌గ‌మ‌నం కొన‌సాగుతోంది. కాస్ట్ క‌టింగ్ పేరుతో టెక్ దిగ్గ‌జ కంపెనీలు ఉద్యోగుల‌కు చెక్ పెడుతున్నాయి. భారీ ఎత్తున తొలగించే ప‌నిలో ప‌డ్డాయి. టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ దీనికి మొద‌ట‌గా శ్రీ‌కారం చుట్టారు. రూ. 4,400 కోట్ల భారీ డీల్ తో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్నాడు.

కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీశాడు. ఆపై టాప్ ఎగ్జిక్యూటివ్ ల‌ను తొలగించాడు. ఏకంగా ప‌ర్మినెంట్ , కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిన ప‌ని చేస్తున్న దాదాపు 9 వేల మందిని తొల‌గించాడు. ఆ త‌ర్వాత గూగుల్ 10 వేల మందికి మంగ‌ళం పాడింది. మ‌రో వైపు ప్ర‌పంచ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ సైతం 18,000 మందిని తొలగించింది.

తాజాగా ఇదే బాట‌లో మ‌రికొన్ని కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గించే ప‌నిలో ప‌డ్డాయి. ఫేస్ బుక్ లో , మైక్రోసాఫ్ట్ లో భారీ ఎత్తున ఉద్యోగాల కోత విధించడంతో ఆయా కార్యాల‌యాల‌న్నీ బోసి పోతున్నాయి.

ఇప్ప‌ట్లో కొత్త వారిని తీసుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. అమెరికా లోని డౌన్ టెన్ సీటెల్ లోని ఆరు అంత‌స్తుల ఆర్బోర్ బ్లాక్ 333 వ‌ద్ద , బెల్లేవ్ లోని స్ప్పింగ్ డిస్ట్రిక్ట్ లోని 11 అంత‌స్తుల బ్లాక్ లో త‌న కార్యాల‌యాల‌ను స‌బ్ లీజ్ కు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు ఫేస్ బుక్ వెల్ల‌డించింది.

ఇది రెసిష‌న్ ను తెలియ చేస్తోంది. ఫేస్ బుక్ నుంచి మెటా గా(Microsoft Meta Layoffs)  మార్చిన త‌ర్వాత దారుణంగా ప‌డ పోయింది అభివృద్ది రేటు. మెటాతో పాటు మైక్రో సాఫ్ట్ త‌మ భ‌వ‌నాల‌ను ఖాళీ చేస్తున్నాయి. టెక్ రంగంలో మార్పు, మార్కెట్ లో ఒడిదుడుకులు తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన సోష‌ల్ మీడియా దిగ్గ‌జం మెన్లో పార్క్ లీజుల‌ను స‌మీక్షిస్తున్న‌ట్లు తెలిపింది.

Also Read : త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో సీ4ఐఆర్ సెంట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!