KTR :ఐటీ హబ్ గా పేరొందిన హైదరాబాద్ కు మరో ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. భారీ పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది మైక్రోసాఫ్ట్.
తెలుగు వాడైన సత్య నాదెళ్ల సిఇఓగా ఉన్న సదరు ఐటీ సంస్థ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు పొందింది. దాదాపు హైదరాబాద్ లో ప్రారంభించే డేటా సెంటర్(KTR )కోసం ఏకంగా రూ. 15 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఇప్పటికే దేశంలోని పుణె, ముంబై, చెన్నై నగరాల్లో ఉన్న డేటా సెంటర్లకు అదనంగా ఈ కొత్తగా ఏర్పాటు కాబోయే కేంద్రం విశిష్ట సేవలను అందించనున్నంది.
ఇందులో క్లౌడ్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ ఎకానమీ ద్వారా వినియోగదారులకు హెల్ప్ చేసేందుకు మైకోసాఫ్ట్ కంపెనీ ఈ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.
అంతే కాకుండా సదరు సంస్థ లో ఉన్న క్లౌడ్ , డేటా సొల్యూషన్స్ , ఏఐ, ప్రొడెక్టివిటీ టూల్స్ , కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ సర్వీసులు అందుబాటులో ఉంచనుంది.
అంతే కాకుండా వ్యాపార సంస్థలకు , అంకురాలకు, డెవలపర్స్ , విద్య, ప్రభుత్వ సంస్థలకు ఈ సేవలు అందజేస్తుంది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్.
అయితే డేటా సెంటర్ ల ఏర్పాటు వల్ల అదనంగా దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మార్కెట్ , ఐటీ వర్గాల అంచనా.
ఈ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల డిజిటల్ ఎకానమీలో మరింత పోటీ నెలకొనే చాన్స్ ఎక్కువగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ (KTR )మాట్లాడారు. హైదరాబాద్ లో డేటా సెంటర్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు.
Also Read : కేంద్రం పెట్రో వాతకు సిద్దం