AAP vs BJP : ఢిల్లీలో అర్ధరాత్రి ఆప్..బీజేపీ హై డ్రామా
బల ప్రదర్శన చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్
AAP vs BJP : ఢిల్లీలో రాజకీయం మరింత వేడెక్కింది. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ , కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ మధ్య నువ్వా నేనా అన్న ఫైట్ నడుస్తోంది.
అవినీతి ఆరోపణలకు దిగింది బీజేపీ. ఇదే సమయంలో తమ సత్తా ఏమిటో నిరూపించేందుకు రెడీ అయ్యారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
అసెంబ్లీ సాక్షిగా బల నిరూపణకు దిగారు. కాగా అర్ధరాత్రి వరకు హై డ్రామా కొనసాగింది ఇరు పార్టీల మధ్య. ఢిల్లీ అసెంబ్లీ వద్ద ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
దీంతో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ఆప్ ఎమ్మెల్యేలు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు(AAP vs BJP) అసెంబ్లీ ఆవరణలోని భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్ విగ్రహాల వద్ద బైఠాయించారు.
నగర పాలక సంస్థ పనుల్లో ఎల్జీ జోక్యం చేసుకుంటున్నారని ఆప్ గతంలో ఆరోపించింది. ఆప్ , ప్రతిపక్ష బీజేపీ రెండూ ఒకరిపై మరొకరు అవినీతి, ఆరోపణలు చేసుకుంటూ మరింత హీట్ పెంచారు.
ఢిల్లీ ప్రాంగణం రాత్రికి సాక్ష్యాలుగా మారింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా 2016లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు రూ. 1,400 కోట్ల విలువైన నోట్ల రద్దు చేయమని తన ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారంటూ ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
మరో వైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ లను బర్తరఫ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : ఎవరీ సిద్దిక్ కప్పన్..ఏమిటా కథ