Asaduddin Owaisi : ఎమ్మెల్యే షకీల్ పై ఓవైసీ ఫైర్
బోధన్ లో బరిలో ఉంటాం
Asaduddin Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. ఆయన గత కొంత కాలంగా భారత రాష్ట్ర సమితి పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చారు. కొంత కాలం నుంచీ బీఆర్ఎస్ కు ఎంఐఎం బేషరతుగా మద్దతు తెలిపింది. కానీ ఊహించని రీతిలో బీజేపీతో , బీఆర్ఎస్ తో ఎంఐఎం టచ్ లో ఉందన్న ప్రచారం జోరందు కోవడం ఒకింత పార్టీకి డ్యామేజ్ కలుగుతుందని భావించారు పార్టీ చీఫ్. తాము ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా అధికార భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యే షకీల్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన తన వ్యవహార శైలిని మార్చుకోవాలని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించారు ఓవైసీ. వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయబోయేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు ఎంఐఎం చీఫ్. బోధన్ లో కావాలని తమ ఎంఐఎం కార్యకర్తలపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
ఇంకోసారి ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఓవైసీ. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు, నాయకులు మూకుమ్మడిగా ఎమ్మె్ల్సీ కవిత కోసం పని చేశారని కానీ ఇప్పుడు కక్ష కట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తాజాగా బాలికపై జరిగిన అత్యాచారానికి, వారి కుటుంబానికి రూ. 30 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read : Zara Hatke Zara Bach ke : జరా హట్కే జరా బచ్ కే జోష్