Srinivas Goud : తెలంగాణలో కీలక మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ హత్య చేసేందుకు ప్లాన్ చేసిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ప్రస్తుతం మంత్రి పాలమూరు జిల్లాకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆయన స్వంత ఊరు అడ్డాకుల మండలం రాచాల. ప్రస్తుతం ఎక్సైజ్ , సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రిగాఉన్నారు శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud). మంత్రి హత్యకు ప్లాన్ చేసిన నిందితులను పేట్ బషీరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఘటనకు సంబంధించి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. విచారణలో యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ పేర్లు బయటకు వచ్చాయన్నారు. గత నెల 26న ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
రాఘవేందర్ రాజు తో సహా మరికొందరు ఈ హత్యకు కుట్ర పన్నారంటూ వెల్లడించారు స్టీఫెన్ రవీంద్ర. అయితే రాఘవేంద్ర రాజు , మున్నూరు రవి, మధుసూదన్ రాజు ఢిల్లీలో ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు.
వీరి లొకేషన్ ట్రేస్ చేశామన్నారు.ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో ఉన్నట్లుత తేలిందని చెప్పారు. వారిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకు వచ్చామని తెలిపారు.
వీరికి జితేందర్ రెడ్డి డ్రైవర్, పీఏ రాజు ఉండేందుకు షెల్టర్ ఇచ్చారని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. రాఘవేంద్ర రాజు నుంచి పిస్టల్ సీజ్ చేశామన్నారు. తాము రాఘవేంద్ర రాజు ను ప్రశ్నించామని , శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) హత్యకు ప్లాన్ చేసినట్లు చెప్పాడన్నారు.
రాజు మొదట ఫారూఖ్ తో కాంటాక్ట్ అయ్యాడు. మంత్రిని హత్య చేస్తే రూ. 15 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశాడన్నారు.
Also Read : గవర్నర్ ప్రసంగం ఆనవాయితీ కాదు