Delhi High Court : మంత్రిని అనర్హుడిగా ప్రకటించలేం – హైకోర్టు
సత్యేంద్ర జైన్ ఎమ్మెల్యే, మంత్రి పదవిపై
Delhi High Court : సత్యేంద్ర జైన్ పై దాఖలైన పిటిషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు(Delhi High Court). ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న జైన్ ను అనర్హుడిగా ప్రకటించాలని ఆదేశించాలని కోరుతూ పిల్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టింది కోర్టు.
ఈ విషయంలో అతడిని అనర్హుడిగా ప్రకటించలేమంటూ స్పష్టం చేసింది. ఆయనను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇంకా కేసు విచారణలో ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది.
ఇప్పటి వరకు తీర్పు వెలువడలేదు. ఎలాంటి ప్రకటన రాకుండా సత్యేంద్ర జైన్ పై వేటు వేయలేమని పేర్కొంది కోర్టు. ఇదిలా ఉండగా జైన్ పై 2018 డిసెంబర్ 3న సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఆయనను తెలివి తక్కువ వ్యక్తిగా ప్రకటించలేం అంటూ పేర్కొంది కోర్టు. జస్టిస్ సతీష్ చందర్ శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ లతో కూడిన ధర్మాసనం కూడా కోర్టు మొత్తం విషయాలను జాగ్రత్తగా పరిశీలించిందని పిటిషనర్ తరపు న్యాయవాదిని కూడా విచారించిందని తెలిపింది.
జైన్ పై కేసులు నమోదైన మాట వాస్తవమేనని, భారతీయ శిక్షా స్మృతి, అవినీతి నిరోధక చట్టంతో పాటు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద పలు నేరాలకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారని ధర్మాసనం పేర్కొంది.
ఇదిలా ఉండగా ఢిల్లీ సర్కార్ లో మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్ షకుర్ బస్తీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెలయే. ఈడీ ముందు తన జ్ఞాపకశక్తి కోల్పోయినట్లు స్వయంగా ప్రకటించారని అదే విషయాన్ని విచారణకు కూడా తెలియ చేశారని పిటిషన్ పేర్కొంది.
Also Read : విపక్షాలు కలిస్తే నితీశ్ కాబోయే పీఎం