Hardeep Singh Puri : ఇప్పటికే ఉక్రెయిన్ పై రష్యా యుద్దం కొనసాగిస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలు కొండెక్కుతున్నాయి. నిన్నటి దాకా ఎన్నికలు ఉండడంతో కాస్తంత నెమ్మదించిన కేంద్ర సర్కార్ ప్రస్తుతం ఎన్నికల పర్వం ముగియడంతో పెట్రోల్, డీజిల్ వాత పెట్టేందుకు డిసైడ్ అయ్యింది.
ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ఇవాళ కీలక కామెంట్స్ చేశారు. ప్రజా ప్రయోజనాల ఆధారంగా ఇంధన ధరలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సమావేశమై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుందన్నారు. ఇప్పటికే మోయలేనంత భారం నెలకొంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
భారీగా పెంచనుందని ఇప్పటికే భయపడుతున్నారు. ఇదే విషయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికలు పోయాయి.
వెంటనే మీ ట్యాంకులు నింపుకోండి అంటూ హెచ్చరించారు. ఒక రకంగా మోదీ ప్రభుత్వంపై సెటైర్లు విసిరారు. తాజాగా కేంద్ర మంత్రి హర్దీప్ పూరి (Hardeep Singh Puri)చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
పౌరుల ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. చమురు ధరల్ని ప్రపంచ మార్కెట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ప్రకటించాడు.
దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. ఈనెల 10న ఫలితాలు రానున్నాయి. ఉత్తరాప్రదేశ్ , పంజాబ్ , ఉత్తరాఖండ్ , గోవా, మణిపూర్ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ తో పాటు గ్యాస్ పై కూడా ధరా భారం మోపింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.
Also Read : ఐటీ దాడులపై రౌత్ కన్నెర్ర