Minister Kishan Reddy : తెలుగు భాషను చిన్న చూపు చూడటం పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ....
Kishan Reddy : హెచ్‌ఐసీసీ వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు రెండో రోజూ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహాసభలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్వోతి ప్రజ్వలన చేసి శుక్రవారం ప్రారంభించగా.. తెలుగు ప్రముఖులు, సినిమా కళాకారులు, సాహితీవేత్తలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకూ హైదరాబాద్ వేదికగా మహాసభలు జరగనున్నాయి. నేడు జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Minister Kishan Reddy Comments
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ.. “ప్రపంచ తెలుగు సమాఖ్య సందర్భంగా వచ్చిన తెలుగువారి అందరికీ శుభాకాంక్షలు. తెలుగు భాష అత్యంత ప్రాచీన భాష. ఈ భాష గొప్పతనం ప్రపంచ దేశాలకు తెలిసేలా తేటతేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా అని పాడుతాం. తెలుగులో ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. ప్రపంచంలో అత్యంత మధురమైన భాష తెలుగు. దేశ భాషలందు తెలుగు లెస్సా అని కృష్ణ దేవరాయలు ఊరికే అనలేదు. ప్రాచీన తెలుగు సాహిత్యానికి కేంద్రం ఎనలేని గౌరవం ఇచ్చింది. తెలుగు భాషను ఎంతో మంది మహానుభావులు కొంతపుంతలు తొక్కించారు. నిజాం కాలంలో మన భాష అణగదొక్కబడింది. అప్పట్లో ఆంధ్ర మహాసభలు నిర్వహించి నిర్బంధాలను దాటారు. కొంతమంది తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారని” అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని సంఘటితం చేసి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సంప్రదాయ విలువలు, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపుష్టి చేయడమే ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముఖ్య ఉద్దేశం. అలా పరిపుష్టి చేసిన వారసత్వ సంపదను నేటి, భావితరాలకు అందించడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం. ఈ మహాసభల్లో పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్దఎత్తున చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సినీ నటులు, విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు సైతం హాజరవుతున్నారు. ఈ మహాసభల్లో సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం, వాణిజ్యం, పారిశ్రామికవేత్తల సదస్సులు నిర్వహిస్తున్నారు. 10 మందికి బిజినెస్ అచీవర్స్ పురస్కారాలు, కంపెనీల ద్వారా సేవా-దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న వారికి సీఎస్‌ఆర్ పురస్కారాలు ఇస్తున్నారు. ఈసారి కొత్తగా తెలుగు ఏంజెల్స్ అనే కార్యక్రమంలో భాగంగా తెలుగువారి స్టార్టప్ కంపెనీలను సైతం పరిచయం చేశారు.
Also Read : Ex Minister Amarnath : టీడీపీ సభ్యత్వ నమోదుపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు