Minister Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు...

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలపై బీజేపీ ఇవాళ(ఆదివారం) చార్జ్‌షీట్ విడుదల చేసింది. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీ 6 అబద్ధాలు.. 66 మోసాల పేరుతో చార్జ్‌షీట్‌లో వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి(Kishan Reddy) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని మాట తప్పారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఏడాది కాలంలో నెరవేర్చలేదని ఆక్షేపించారు.

Minister Kishan Reddy Slams..

కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. కాంగ్రెస్ విజయోత్సవాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. విజయోత్సవాల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అలవికానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆక్షేపించారు. హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్‌కు ఏడాది గడువు ఇచ్చామని అన్నారు. ఏడాది గడిచినా రుణమాఫీ అందరికీ పూర్తి కాలేదని కిషన్‌రెడ్డి తెలిపారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకారిపూరిత వైఖరినే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ రాలేదని చెప్పారు. మోదీ నాయకత్వంలో తెలంగాణలో అధికారం బీజేపీదేనని తెలిపారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహాయం అందించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నుంచి నిధులు ఇస్తుందని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఇక కాంగ్రెస్‌కు ప్రజా ఉద్యమాల ద్వారానే బుద్ది చెప్పాలని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

Also Read : Mohan Bhagwat : సంతానోత్పత్తి తగ్గుదల పై ఆర్ఎస్ఎస్ అధినేత ఆందోళన

Leave A Reply

Your Email Id will not be published!