Minister Kishan Reddy : దేశాభివృద్ధికి యువత చాలా కీలకం అంటున్న కేంద్రమంత్రి

రాష్ట్రీయ ఏక్తా పర్వ్‌ లాంటి కార్యక్రమాలు దేశాన్ని సాంస్కృతికంగా ఏకం చేయడానికి దోహదం చేస్తాయన్నారు...

Kishan Reddy : కేంద్రీయ విద్యాలయాలు శక్తివంతమైన మినీ ఇండియా లాంటివని, ప్రతీ పాఠశాల భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రీయ ఏక్తా పర్వ్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాతికేళ్లలో భారత్‌ను విశ్వగురుగా తీర్చిదిద్దే సవాల్‌ను స్వీకరించాలని, యువత ఈ దిశగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఏక్‌ భారత్‌ శ్రేష్ట్‌ కార్యక్రమం కింద భిన్న సంస్కృతులను ఏకం చేసే కృషి జరుగుతుందని చెప్పారు. రాష్ట్రీయ ఏక్తా పర్వ్‌ లాంటి కార్యక్రమాలు దేశాన్ని సాంస్కృతికంగా ఏకం చేయడానికి దోహదం చేస్తాయన్నారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారటంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

Minister Kishan Reddy Comment

ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. 75 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా దేశంలో సాంస్కృతిక సమగ్రత పటిష్ఠంగా ఉందన్నారు. దేశ యువశక్తిని నైపుణ్యాలతో సుసంపన్నం చేయడానికి ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయన్నారు. దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించే కళలు, ఆచార వ్యహారాలను ప్రతిబింబించే స్టాళ్లను ఆయా రాష్ట్రాల విద్యార్థులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్‌, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ కమిషనర్‌ నిధి పాండే, హైదరాబాద్‌ రీజన్‌ కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ సహాయ కమిషనర్‌ మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read : Amit Shah : బీజేపీ తీసుకొచ్చే వక్ఫ్ సవరణ బిల్లును ఎవరూ ఆపలేరు

Leave A Reply

Your Email Id will not be published!