Minister Komatireddy : ప్రతిపక్షాలకు మంచి మానవత్వం లేదు..మూసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే మొఖమే లేదన్నారు...
Minister Komatireddy : మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రత్యక్ష ఉద్యమం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీని ప్యూరిఫైర్ రివర్‌గా మార్చాలని ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతిపక్షాలకు మానవత్వం లేదని మండిపడ్డారు. కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్‌లకు మానవత్వం లేదని విమర్శించారు. నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరెడ్ ఎక్కువని తెలిపారు. పది సంవత్సరాలు పాలించి లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మూసీలో పారేది విషపు నీళ్లని.. తెలంగాణ వచ్చాక మూసీ స్థితి మారుతుందని అనుకున్నామన్నారు. మూసీ కోసం కేటీఆర్ వెయ్యి కోట్ల అప్పు తెచ్చారన్నారు. అయితే మూడు నాలుగు కోట్లు పెట్టి వాళ్లు విల్లా కొనుక్కుంటే.. గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లు మూసీ పక్కన ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
Minister Komatireddy Comment
కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే మొఖమే లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలన్నారు. కేసీఆర్(KCR) అసెంబ్లీకి వస్తే లేవకుండా చేస్తానన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకులు కాదని.. రాజకీయ నాయకులే అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ కేసీఆర్, కేటీఆర్(KTR) మా ఊరిలో బస చేద్దాం. మా ఊరిలో టిఫిన్ కూడా చేయలేవు’’ అంటూ.. మాయమై పోతున్నడమ్మ మనిషిన్నవాడు అనే పాటను మంత్రి గుర్తు చేశారు. ‘‘ మీరు మనుషులేనా? కనీసం మానవత్వం లేదా? మూసీ డెవలప్‌మెంట్ బోర్డు అన్నావ్ కదా ఏమైంది? లక్షల కోట్లు సంపాదించావ్.. పేదలపై కొంచెం కూడా జాలి లేదా? కాళేశ్వరం ఒక తుగ్లక్ పని.. మల్లన్న సాగర్ నిర్వాసితులను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చూశాం.. మూసీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్ దగ్గర ఓఎస్‌డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్‌ను అడగండి. మల్లన్న సాగర్ నిర్వాసితులను పోలీసులతో ఎందుకు కొట్టించారు. మూసీ ప్రక్షాళన చేస్తే కమిషన్ రాదని మొదలు పెట్టలేదా? పదేండ్లు అధికారంలో ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో అలా ఓడిపోవడానికి సిగ్గు లేదా?’’ అంటూ విమర్శలు గుప్పించారు.
మూసీ అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ‘‘ నేను నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నాను. మమ్మల్ని సావమంటావా? సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వాళ్లు గోదావరి జలాలతో సంతోషంగా ఉండాలి. నల్గొండ మూసీ మురికితో చావాలా? మూసీ నీళ్లను అమెరికా తీసుకెళ్ళి టెస్ట్ చేయించండి. నల్గొండ వచ్చినా, వయా నల్గొండ వెళ్ళినా అక్కడి ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. జిల్లా పరిషత్ బడుల్లో చదివిన మాకే ఇంత తెలివి ఉంది. అమెరికాలో చదువుకున్న అని చెప్పుకుంటున్న నీకు తెలివి ఏమైంది? నల్గొండలో మీ బంధువులు లేరా? నల్గొండపై ఎందుకు కక్ష కట్టారు? కేటీఆర్‌ను చూస్తే చాలా కోపం వస్తుంది.
మూసీ వల్ల కలిగే ఇబ్బంది తెలుసుకుంటే జర్నలిస్టులు వెళ్లి కేసీఆర్‌ను కొడుతారు’’ అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా అంటూ కేసీఆర్‌కు కోమటిరెడ్డి(Minister Komatireddy) సవాల్ విసిరారు. ‘‘ బస్సు పెడుతా, నేను మీతో పాటే వస్తా.. మూసీ గురించి మాట్లాడితే ప్రజలు చెప్పులతో కొడుతారు. ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారు. తిన్నది అరగడం లేదా కేటీఆర్, హరీష్. దోచుకున్న పైసలతో ఏదైనా బిజినెస్ చేసుకోండి. ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. నేను 25 ఏండ్ల కింద మూసీ కోసం 11 రోజులు దీక్ష చేశాను. నా దీక్షకు ప్రొఫెసర్ జయశంకర్ మద్దతు తెలిపారు. వర్షం పడితే రాజ్‌భవన్ ముందు కార్లు మునిగిపోతున్నాయి. అట్లనే ఉంచూదామా? హరీష్ రావో, అగ్గిపెట్టె రావో వెళ్లి మూసీ దగ్గర ఉంటే రోగాలు వస్తాయి అని చెప్పాలి. ఇల్లు పోయిన వాళ్ళకి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేయాలి. కేసీఆర్ నాలాగా దీక్ష చేశారా’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read : MP Purandeswari : తిరుమల లడ్డు కల్తీ చంద్రబాబు ప్రకటించడంపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ