Minister KTR : ఆ ఇద్ద‌రికీ రూ కోటిన్న‌ర సాయం

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్ల‌డి

Minister KTR : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త రాష్ట్ర స‌మితికి ఎన‌లేని సేవ‌లు అందించిన కుసుమ జ‌గ‌దీశ్ , గాయ‌కుడు సాయిచంద్ మ‌ర‌ణం తీర‌ని లోటు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అకాల మ‌ర‌ణం పార్టీ ప‌రంగా త‌మ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింద‌న్నారు. ఇందులో భాగంగా ఆ రెండు కుటుంబాల‌కు పార్టీ ప‌రంగా ఆదుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

వారి కుటుంబాల‌కు సీఎం కేసీఆర్ అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించార‌ని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్ర‌జా ప్ర‌తినిధుల ఒక నెల జీతం మూడు కోట్ల‌కు పైగా వ‌స్తుంద‌న్నారు. ఆ రెండు కుటుంబాల‌కు కోటిన్న‌ర రూపాయ‌లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు కేటీఆర్.

జ‌గ‌దీశ్ , సాయి చంద్ ల కుటుంబాల పేరెంట్స్ ను ఆదుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశార కేటీఆర్(KTR). తాజాగా మ‌ర‌ణించిన సాయిచంద్ భార్య ర‌జ‌నికి కీల‌క ప‌ద‌వి ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు. తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వికి ఎంపిక చేసిన‌ట్లు చెప్పారు. శుక్ర‌వారం కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు కేటీఆర్. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీపై నిప్పులు చెరిగారు మంత్రి.

Also Read : CM Siddaramaiah : మైసూరులో చిత్ర‌న‌గ‌రి నిర్మాణం

 

Leave A Reply

Your Email Id will not be published!