KTR & Yashwant Sinha : య‌శ్వంత్ సిన్హాకు కేటీఆర్ ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రానికి రావాల‌ని విన్న‌పం

KTR & Yashwant Sinha : భార‌త దేశంలో అత్యున్న‌త ప‌ద‌వి రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం ఎన్నిక అనివార్యం కావ‌డంతో అధికార పక్షం నుంచి ఆదివాసీ బిడ్డ ద్రౌప‌ది ముర్మును నిల‌బెట్టింది. ఆమె నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

సోమ‌వారం ఈనెల 27న విప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు అగ్ర నేత‌లు ఆయ‌న‌కు స‌పోర్ట్ తెలిపారు.

ఇదే స‌మ‌యంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో తెలంగాణ రాష్ట్ర స‌మితి కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పార్టీ చీఫ్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పార్టీ త‌ర‌పున బేష‌ర‌త్తు మ‌ద్ద‌తు విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన య‌శ్వంత్ సిన్హాకే మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఆ మేర‌కు సీఎం త‌ర‌పున మంత్రి కేటీఆర్ సిన్హా నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో టీఆర్ఎస్ ఎంపీల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఇందులో కాంగ్రెస్ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ, స‌మాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ , ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్, టీఎంసీ అగ్ర నాయ‌కుడు , ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా నామినేష‌న్ వేసిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మోదీ పాల‌న‌పై నిప్పులు చెరిగారు. ఈ దేశంలో భార‌త రాజ్యాంగం న‌డ‌వ‌డం లేద‌ని మోదీ రాజ్యాంగం అమ‌ల‌వుతోందంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఇదే స‌మ‌యంలో రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న య‌శ్వంత్ సిన్హాను తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు కేటీఆర్ (KTR & Yashwant Sinha). అందుకు ఆయ‌న ఓకే చెప్పారు.

Also Read : దేశంలో మోదీ రాజ్యాంగ పాల‌న – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!