Minister KTR Invited : కేటీఆర్ కు అంతర్జాతీయ ఆహ్వానం
24న బ్రస్బేల్ లో కీలక సదస్సు
Minister KTR Invited : తెలంగాణ ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. ఆయన మోస్ట్ డైనమిక్ లీడర్ గా ఇప్పటికే గుర్తింపు పొందారు. ప్రత్యేకించి ఐటీ పరంగా మంచి పట్టు కలిగిన కేటీఆ్ ఎక్కువగా దానిపై ఫోకస్ పెట్టారు. దీంతో ఇండియాలోనే ఐటీ పరంగా నెంబర్ 1గా తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిని ఆకళింపు చేసుకోవడంలో, వాటిని ప్రోత్సహించడంలో ఎప్పటికీ ముందంజలో ఉంటున్నారు కేటీఆర్. ఇప్పటికే టీ హబ్, వీ హబ్, అగ్రి హబ్, స్టార్టప్ హబ్ , ఇన్నోవేషన్స్ కు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు మంత్రి.
Minister KTR Invited from Brazil
అధికారికంగా పలు అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్నారు. ఆయన అమెరికాలో చదువు కోవడం వల్ల బహు భాషల్లో మంచి పట్టుంది. ఇదే సమయంలో అన్ని రంగాలపై అవగాహన కలిగి ఉండడం పెద్ద బలంగా మారింది కేటీఆర్(KTR) కు. తాజాగా అక్టోబర్ 24న బెల్జియం రాజధానిలో టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ టెక్ యాక్సిలరేటర్ 2023 ఫోరం కొనసాగనుంది.
ఇందులో కీలక భాగస్వామిగా పాల్గొనాలని ఆహ్వానం అందింది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సంస్థకు మాజీ యుకె పీఎం టోనీ బ్లెయిర్ చీఫ్ గా ఉన్నారు. ఏఐ, ఐటీ, పరిశ్రమలు, ఇన్నోవేషన్ తదితర రంగాలలో తెలంగాణ సర్కార్ సాధించిన ప్రగతికి గుర్తింపే ఈ ఇన్విటేషన్ అని పేర్కొన్నారు మంత్రి.
Also Read : Revanth Reddy : రాజీవ్ వల్లనే టెక్నాలజీ డెవలప్