Minister KTR : వనపర్తి జిల్లా – ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యతోనే వికాసం అలవడుతుందన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన ఆయిల్ పామ్ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేశారు. అనంతరం అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని సందర్శించారు. మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ఫోటో దిగారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జీవితంలో పైకి ఎదగాలంటే చదువు ఒక్కటే ఉపయోగ పడుతుందన్నారు. దీనితోనే హోదా, గౌరవం దక్కుతుందన్నారు. మీరు ఎదుగుతూ ఇతరులను కూడా ఎదిగేందుకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
Minister KTR Comment on Education
రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికలు, యువతకు ప్రయారిటీ ఇస్తోందన్నారు. ఇవాళ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. విద్య, ఆరోగ్య రంగానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అన్ని రంగాలలో మన రాష్ట్రం ముందంజలో కొనసాగుతోందన్నారు.
ఇవాళ ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే అన్ని ప్రాంతాలలో విద్యా రంగం అభివృద్ది చెందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్(Minister KTR).
కృష్ణా జలాలను ఒడిసి పట్టి పాలమూరు జిల్లాలోని బీడు భూములకు నీళ్లు మళ్లించామని, ఈ ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే రైతులకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు మంత్రి కేటీఆర్.
Also Read : Narayana Konakalla : వైసీపీ సర్కార్ వేధిస్తోంది – నారాయణ