Minister KTR : హైదరాబాద్ – ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. కోడంగల్, కామారెడ్డి లలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓడి పోవడం పక్కా అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఓట్లు పడవని తెలుసు కోవాలన్నారు కేటీఆర్.
Minister KTR Comments
హైదరాబాద్ లోని గోషామహల్ లో బరిలోకి దిగిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తో పాటు హుజూరాబాద్ లో మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా పరాజయం పాలవక తప్పదన్నారు మంత్రి.
మొత్తం ముగ్గురికి రాజకీయ భవిష్యత్ లేకుండా పోతుందన్నారు కేటీఆర్(Minister KTR). కాంగ్రెస్, బీజేపీలకు అంత సీన్ లేదన్నారు. వాళ్లకు అధికార యావ తప్ప ప్రజల బాగోగుల గురించి సోయి లేదన్నారు . తమ పార్టీలోకి పెద్ద ఎత్తున ఆయా పార్టీలకు చెందిన సీనియర్ నేతలు చేరుతున్నారని చెప్పారు మంత్రి. రాష్ట్రంలో మరోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం పక్కా అన్నారు.
దేశంలోనే అన్ని రంగాలలో ముందంజలో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని చెప్పారు కేటీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరిగిందన్నారు.
Also Read : Sunil Kanugolu : 300 మందితో కనుగోలు ఎంటర్