Minister KTR : జ‌నం గులాబీ జెండా వైపే

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి

Minister KTR : హైద‌రాబాద్ – ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల న‌గారా మోగింది. బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో స‌భ‌లు, స‌మావేశాలు, స‌మీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ప‌లువురు నేత‌లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.

Minister KTR Comments Viral

ఈ సంద‌ర్బంగా మంత్రి కేటీఆర్(Minister KTR) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌లంతా అభివృద్దితో కూడిన పాల‌న‌ను అందిస్తున్న బీఆర్ఎస్ ప‌ట్ల న‌మ్మ‌కంతో ఉన్నార‌ని అన్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు కేటీఆర్.

మొత్తం 119 సీట్ల‌కు గాను క‌నీసం 100 సీట్ల‌కు పైగానే రానున్నాయ‌ని, కొంద‌రు స‌ర్వేల పేరుతో త‌మ‌కు అనుకూలంగా చేయించు కుంటూ జ‌నాన్ని ప్ర‌లోభ పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఆరు నూరైనా స‌రే తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని జోష్యం చెప్పారు మంత్రి కేటీఆర్.

ఆరు గ్యారెంటీల హామీ పేరుతో క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాల‌న చేత‌కాక చేతులెత్తేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఇప్ప‌టికే రైతులు రోడ్డెక్కార‌ని, చివ‌ర‌కు మొస‌ళ్ల‌ను కూడా తీసుకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్క‌టేన‌ని ఆరోపించారు.

Also Read : Cheruku Sudhakar : తెలంగాణ గుండె చ‌ప్పుడు బీఆర్ఎస్

Leave A Reply

Your Email Id will not be published!