తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, ఆటో మొబైల్ , టెలికాం, తదితర రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు భారీ ఎత్తున హైదరాబాద్ ను ఎంచుకుంటున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ ఇక్కడ కొలువు తీరాయి. తాజాగా మరో దిగ్గజ కంపెనీ ఫాక్స్ కాన్ కంపెనీకి సంబంధించి ప్లాంట్ కు భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ లో దీనిని ఏర్పాటు చేయనున్నారు.
ఈ కంపెనీ పూర్తయితే 35,000 మందికి పైగా జాబ్స్ వస్తాయని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కేటీఆర్. ఇదిలా ఉండగా ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
200 మిలియన్ డాలర్లు అంటే భారతీయ రూపాయల్లో రూ. 1,656 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనుంది ఫాక్స్ కాన్ కంపెనీ. ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మొబైల్ ఫోన్స్ , ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో టాప్ లో కొనసాగుతోంది ఫాక్స్ కాన్ కంపెనీ. దాదాపు వరల్డ్ వైడ్ గా మోస్ట్ డ్యూరబుల్ ఫోన్లు గా పేరు పొందిన ఐఫోన్లను 80 శాతానికి పైగా ఫాక్స్ కాన్ కంపెనీనే తయారు చేస్తుంది. తాజాగా ఈ కంపెనీ బెంగళూరులో కూడా స్థలాన్ని కొనుగోలు చేసింది.