KTR : బీజేపీ సమావేశాలపై కేటీఆర్ సెటైర్
వాట్సాప్ యూనివర్శిటీకి గ్రాండ్ వెల్ కమ్
KTR : భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలో ఎక్కడ చూసినా కాషాయ జెండాలతో నిండి పోయింది.
ఇదే సమయంలో దేశంలోని బీజేపీకి చెందిన సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, సీనియర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కొలువు తీరారు.
ప్రత్యేకంగా మెనూ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో దేశ వ్యాప్తంగా పేరొందిన వంటకాలతో పాటు తెలంగాణ వంటకాలు కూడా వడిస్తున్నారు.
ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇక్కడికి రానున్నారు. ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రెండు రోజుల పాటు ఉంటారు. రాజ్ భవన్ లో విడిది చేస్తారు.
ఈ సందర్భంగా భాగ్యనగరం పూర్తిగా పోలీసులతో నిండి పోయింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బీజేపీ సమావేశాలపై స్పందించారు. బీజేపీ తీరుపై సీరియస్ అయ్యారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు. పనిలో పనిగా బీజేపీని ఎద్దేవా చేశారు కేటీఆర్(KTR). వాట్సాప్ యూనివర్శిటీకి స్వాగతం అంటూ సెటైర్ వేశారు.
శనివారం మంత్రి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అబద్దాల హామీకోరులంతా మా దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ ని ఆస్వాదించడం మరిచి పోవద్దంటూ సూచించారు.
మా అభివృద్దిని చూడండి కాస్తా నేర్చుకోండి అంటూ పేర్కొనడం కలకలం రేపింది. అంతే కాకుండా మంత్రి కేటీఆర్ బీజేపీ నాయకులకు సందర్శించాల్సిన ప్రాంతాలు, వాటికి చెందిన ఫోటోలను కూడా షేర్ చేయడం విశేషం.
Also Read : ముందస్తు వ్యూహం బీజేపీ సిద్ధం