KTR Aero Space : ఏరో స్పేస్ లో హైద‌రాబాద్ టాప్

యుఎస్ లో మంత్రి కేటీఆర్ ప్ర‌క‌ట‌న

KTR Aero Space : తెలంగాణ ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆక‌ర్షించేలా ఇక్క‌డికి నుంచి అక్క‌డికి వెళ్లారు. ఆయ‌న న్యూయార్క్ లో చ‌దువుకున్నారు. అక్క‌డ జాబ్ కూడా చేశారు. ఆపై అమెరికా క‌ల్చ‌ర్ , నాగ‌రిక‌తతో మంచి ప‌రిచ‌యం కూడా ఉంది.

ఉద్య‌మ స‌మ‌యంలో యుఎస్ ను వ‌దిలేసి వ‌చ్చారు. పూర్తి స్థాయి రాజ‌కీయాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. ఆపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐటీ శాఖా ప‌రంగా త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు. ప్ర‌స్తుతం తండ్రి సీఎం కావ‌డంతో నెంబ‌ర్ 2గా అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దిగ్గ‌జ కంపెనీలు హైద‌రాబాద్ కు తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు కేటీఆర్.

తాజాగా యుఎస్ టూర్ లో ఉన్న మంత్రి కేటీఆర్ ఏరో స్పేస్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2018, 2020, 2022ల‌లో వ‌రుస‌గా మూడు ఏళ్ల పాటు ఏరో స్పేస్ కు సంబంధించి ఉత్త‌మ రాష్ట్ర అవార్డుల‌ను గెలుచుకుంద‌ని తెలిపారు. గొప్ప ఫీట్ ను సాధించిన ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కుతుంద‌న్నారు.

ఎఫ్డీఐ ర్యాంకింగ్స్ 2020 ఆర్థిక అంచ‌నా ప్ర‌కారం హైద‌రాబాద్ కాస్ట్ ఎఫెక్టివ్ పారా మీట‌ర్ లో ఫ్యూచ‌ర్ నంబ‌ర్ 1 ఏరో స్పేస్ సిటీగా నిలిచిందని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. ఈ పుర‌స్కారాలు ఏరో స్పేస్ రంగం ప‌ట్ల రాష్‌ట్ర ప్ర‌గ‌తిశీల దృక్ప‌థాన్ని తెలియ చేస్తుంద‌న్నారు మంత్రి.

Also Read : Supreme Court Gets

 

Leave A Reply

Your Email Id will not be published!