Minister KTR : హైదరాబాద్ – కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఎన్నో ఏళ్లు పోరాటం చేసి కోరి కొనితెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న, చేయబోయే కంపెనీలు రాకుండా కుట్రకు తెర తీశాడంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు కేటీఆర్.
Minister KTR Slams DK Shiva Kumar
హైదరాబాద్ కు కాకుండా బెంగళూరుకు తరలించుకు పోయేందుకు ప్లాన్ చేశాడని, ఇందుకు సంబంధించిన లేఖలు బయట పడ్డాయంటూ వెల్లడించారు. ఫాక్స్ కాన్ కంపెనీని హైదరాబాద్ నుండి తమ ప్రాంతానికి తరలించాలని కోరుతూ సిఇఓకు లెటర్ రాయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఎన్నికల వేళ కేటీఆర్(Minister KTR) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఉపయోగం అంటూ ఉండదన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని కంపెనీలు హైదరాబాద్ లో కొలువు తీరి ఉన్నాయని ఈ క్రెడిట్ అంతా సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్ సీఎంగా ఉండడం వల్లనే సాధ్యమైందన్నారు.
తెలంగాణ ఆచరిస్తుంటే భారత దేశం అనుసరించడం కొనసాగుతూనే ఉన్నదని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : Malla Reddy : మైనంపల్లి పిచ్చోడు అయిండు