Minister KTR : ములుగు – రాబంధులను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR). పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపు మంట ఎందుకని నిలదీశారు. మోసం కాంగ్రెస్ నైజమని ఎద్దేవా చేశారు. ఎరువులు, విత్తనాలకు పైసలు ఇచ్చే రైతు బంధును బంద్ పెట్టించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు కేటీఆర్.
Minister KTR Serious Comments
ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు నియోజకవర్గంలో భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా బడే నాగ జ్యోతి బరిలో ఉన్నారు. ఆమెకు మద్దతు ఇవ్వాలని , ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క చేసింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.
కాంగ్రెసోళ్లను రాబందులతో పోల్చారు. వీళ్లను గెలిపిస్తే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందన్నారు. వాళ్లకు విజన్ అంటూ ఉండదంటూ ఎద్దేవా చేశారు. ఎవుసం చేసుకునే రైతులను మోసం చేయడం ఎంత వరకు సబబు అని మండిపడ్డారు కేటీఆర్.
కాంగ్రెస్ పార్టీ బలుపు చూసి వాపు అనుకుంటోందన్నారు. అన్నదాతలకు సాయం అందకుండా అడ్డుపుల్లలు వేసి వికృతానందం పొందుతున్నారని ఆరోపించారు . దుక్కి దున్నే బక్క రైతులపై ద్వేషం ఎందుకని ప్రశ్నించారు.
Also Read : Priyanka Gandhi Viral : అపూర్వ ఆదరణ అనూహ్య స్పందన
