KTR IKEA : ఐకియా నిర్వాకం కేటీఆర్ ఆగ్రహం
జర్నలిస్ట్ ఆరోపణలకు సమాధానం
KTR IKEA : తరాలు మారినా, మనుషులు ఎదిగినా టెక్నాలజీ విస్తరించినా ఇంకా ప్రవర్తనలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల పలు ప్రాంతాలలో వివక్ష ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నది.
ఈ జాడ్యం ప్రతి చోటా చాప కింద నీరులా విస్తరించి ఉంది. ఒక చోట మతం మరో చోట కులం. ఇంకో చోట ప్రాంతం. ఇలా చెప్పుకుంటూ పోతే అందమైన భవంతులు, ఆకాశ హార్మ్యాలు ఉన్నా వివక్ష ఏదో ఒక రూపంలో కొనసాగుతూ వస్తూ ఉన్నది.
తమకు జరిగిన ఘటనకు సంబంధించి ట్విట్టర్ లో షేర్ చేశారు ఒకరు. దీనిపై వెంటనే స్పందించారు మంత్రి కేటీఆర్. ఐకియా అనేది హైదరాబాద్ లో బిగ్ షాపింగ్ కాంప్లెక్స్. స్వీడిష్ రెడీ టు అసెంబుల్ ఫర్నీచర్ బ్రాండ్ గా పేరొందింది ప్రపంచ వ్యాప్తంగా.
ఈ స్టోర్ లో జాత్యహంకార ఘటనపై ఆరోపణలు వెళ్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఐకియా(KTR IKEA ) కంపెనీ నుంచి క్షమాపణలు కోరారు. నితిన్ సేథి అనే జర్నలిస్ట్ చేసిన ట్వీట్ కలకలం రేపింది.
దీనిపై వెంటనే రీట్వీట్ చేశారు మంత్రి. మణిపూర్ కు చెందిన నా భార్య కొన్ని వస్తువులు కొనుగోలు చేసింది. మాకంటే ముందు ఎవరూ లేరు. కానీ అక్కడ సూపర్ వైజరీ సిబ్బంది వచ్చారు.
కాని వారి ప్రవర్తన దారుణంగా ఉందంటూ వాపోయాడు. షాపింగ్ బ్యాగ్ లను అన్నీ తనిఖీ చేశారు. తమను వేరుగా చూశారంటూ వాపోయాడు.
తమ లాంటి వారు రోజూ ఎదుర్కొంటున్న వ్యవహారమేనంటూ పేర్కొన్నాడు. సిబ్బంది వ్యంగ్యంగా కామెంట్స్ చేశారంటూ ఆరోపించాడు.
Also Read : దీపావళి నాటికి జియో 5జీ ధమాకా – అంబానీ