Minister KTR : హైదరాబాద్ – ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన సభలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై అవాకులు చెవాకులు పేలుతూ వస్తున్న టీపీసీసీ చీఫ్ చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు.
Minister KTR Slams Revanth Reddy
ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా ఎలా చేస్తారంటూ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సోనియా గాంధీకి లేఖ కూడా రాశారని ఆ విషయం మరిచి పోయావా రేవంత్ అంటూ ఘాటుగా విమర్శించారు కేటీఆర్.
మోసానికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు ఎవరూ ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు మంత్రి. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ హవా కొనసాగుతుందన్నారు. ఇప్పటికే పలు సర్వే సంస్థలు సీఎం కేసీఆర్ కు ఢోకా లేదని పేర్కొన్నాయని తెలిపారు. తాజాగా నేషనల్ ఛానల్ టైమ్స్ నౌ సర్వే కూడా తేల్చి చెప్పిందన్నారు.
గతంలో కంటే ఈసారి మరిన్ని సీట్లు కైవసం చేసుకుంటామని జోష్యం చెప్పారు మంత్రి కేటీఆర్(Minister KTR). కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రజలకు శాపాలు అని ఆరోపించారు. కర్ణాటకలో అన్న భాగ్య స్కీంకు తమ ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పారు.
Also Read : Jagadish Reddy : కోమటిరెడ్డి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఫేక్