Minister KTR : రేవంత్ రెడ్డి కిష‌న్ రెడ్డికి ఏజెంట్

ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్

Minister KTR : హైద‌రాబాద్ – ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి , బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Minister KTR) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి భార‌తీయ జ‌న‌తా పార్టీకి తొత్తుగా ప‌ని చేస్తున్నాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అంతే కాదు టీపీసీసీ చీఫ్ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గంగాపురం కిష‌న్ రెడ్డికి ఏజెంట్ అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు ఐటీ మంత్రి కేటీఆర్.

Minister KTR Slams Revanth Reddy

గ‌తంలో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ లో ప‌ని చేశాడ‌ని, ప్ర‌ధాన మంత్రి మోదీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కు తాబేదారుగా ప‌ని చేస్తున్నాడంటూ ఆరోప‌ణ‌లు చేశారు. మొద‌ట టీఆర్ఎస్ లో ఉన్నాడ‌ని, ఆ త‌ర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడ‌ని, అక్క‌డి నుంచి డ‌బ్బులు ఇచ్చి టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి తెచ్చుకున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్.

ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి మొద‌లైంద‌ని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కై ఊచ‌లు లెక్క బెట్టి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన రేవంత్ రెడ్డి తిరిగి వ‌సూళ్ల దందాకు తెర లేపాడంటూ ఫైర్ అయ్యారు. టికెట్ కు రేటు ప్ర‌క‌టించారంటూ ఆ పార్టీకి చెందిన నేత‌లే ఆరోపిస్తున్నార‌ని ఇంత‌కంటే ఇంకేం ఆధారం కావాల‌ని ప్ర‌శ్నించారు కేటీఆర్.

Also Read : K Raghavendra Rao : చంద్రుడు రావాలి వెలుగు తేవాలి

Leave A Reply

Your Email Id will not be published!