Minister KTR : తెలంగాణ బస్సుల్లో భరోసా – కేటీఆర్
సిరిసిల్లలో ప్రారంభించిన ఐటీ మంత్రి
Minister KTR : తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సీసీ టీవీలను ఏర్పాటు చేసింది. పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ప్రతి రోజూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రతి రోజూ రాష్ట్ర మంతటా 45 లక్షల మంది నిత్యం రాక పోకలు సాగిస్తుంటారు ప్రయాణికులు. ఇదే సమయంలో కొత్త బస్సులను తీసుకు వచ్చింది. ఇదే క్రమంలో బస్సుల్లో నిత్యం మహిళలు, యువతులు, బాలికలు, స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తుంటారు.
Minister KTR Observing CC Camers in School Buses
చదువుకునేందుకని సుదూర ప్రాంతాలకు వెళుతూ వస్తుంటారు. పోకిరీల బెడద నుంచి రక్షించేందుకు గాను వినూత్నమైన ఆలోచన చేసింది కరీంనగర్ జిల్లా. ఈవ్ టీజింగ్ ను తగ్గించాలనే లక్ష్యంతో జిల్లాలోని 130 ఆర్టీసీ బస్సులతో పాటు అన్ని పాఠశాలల బస్సుల్లో పోలీస్ కంట్రోల్ రూమ్ కు కనెక్టివిటీతో కూడిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉంది.
మహిళలకు సంబంధించి షీ టీమ్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్ . ప్రత్యేకించి మహిళల కోసం ఉద్దేశించినది. మంగళవారం ఇండిపెండెన్స్ డే సందర్బంగా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) ఆర్టీసీ బస్సులలో ఏర్పాటు చేసిన సీసీటీవీలను పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీసులను అభినందించారు. ఈ ఆలోచనను రాష్ట్రమంతటా అమలు చేయాలని సూచించారు. దీనికి బస్సుల్లో భరోసా అని పేరు పెట్టారు.
Also Read : Nara Lokesh : జగన్ రాసి పెట్టుకో వడ్డీతో చెల్లిస్తా