Minister Nara Lokesh: వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహంపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం

వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహంపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం

Nara Lokesh : కొంతమంది వైసీపీ కార్యకర్తలు… చిన్నపిల్లలు ఉపయోగించే సైకిల్ ను ధ్వంసం చేస్తున్న వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి వీడియోలు… 2024కు ఎన్నికలకు ముందు కొన్ని రావడంతో… కొంతమంది ఈ వీడియో పాతదే అని భావిస్తున్నారు. అయితే ఈ ఘటన తాజాగా జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి పెళ్లి వేడుక సందర్భంగా హాజరైన వైసీపీ కార్యకర్తలు… ఇబ్రహీంపట్నంలో సైకిల్ తొక్కుతున్న ఓ చిన్నపిల్లాడి వద్ద నుండి సైకిల్ లాక్కుని దానిని ధ్వంసం చేసారు. సైకిల్‌ను గాల్లో తిప్పి… నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కుతూ ఆనందం పొందారు. ఓ పక్క ఆ పిల్లాడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా దుశ్చర్యకు పాల్పడ్డారు.

Minister Nara Lokesh Slams

దీనితో ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహంపై మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించినా వాళ్ల తీరు మారలేదని… మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చి… వాళ్లు చేసిన పిచ్చి చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్… తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ వేదికగా… ఆ వీడియోను షేర్ చేస్తూ… వైసీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా… ‘‘అబ్బే.. వాళ్లేమీ మారలేదు..మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో.. ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికీ… నేటికీ… ఎప్పటికీ అదో సైకో పార్టీ… వాళ్లకి సైకో నాయకుడు! ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ల ఆలోచనలను, చిన్న పిల్లవాడి చేతి నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ, విరగ్గొడుతూ చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింతగా అర్థం చేసుకోవాలని ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నాను’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Also Read : Vizianagaram MRO: సిక్కిం వరదల్లో చిక్కుకున్న విజయనగరం ఎమ్మార్వో కుటుంబం 

Leave A Reply

Your Email Id will not be published!