Minister Niranjan Reddy : రూ. 403 కోట్లతో కోహెడ మార్కెట్
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan Reddy : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు వెండార్స్ కు తీపి కబురు చెప్పింది. ఆసియా లోనే అతి పెద్ద మార్కెట్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy) నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. బాట సింగారం, పహాడీ షరీఫ్ పండ్ల మార్కెట్ లలో ఏర్పాటు చేయనున్న సౌకర్యాలపై చర్చించారు.
Minister Niranjan Reddy Said
ఈ కీలక మీటింగ్ కు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ , ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తో పాటు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ వ్యవసాయ శాఖ మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు సాగు మంత్రి.
ఇందులో భాగంగా 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో కోహెడ మార్కెట్ ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. 48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం చేపడతామన్నారు. 16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 11.76 ఎకరాల్లో పండ్ల ఎగుమతులకై ఎక్స్ పోర్టు జోన్ 56.54 ఎకరాల్లో రహదారులు, 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read : Amit Shah Focus : తెలంగాణ బీజేపీపై షా ఫోకస్