Minister Ponguleti : కేసీఆర్ సర్కార్ కేంద్రం నుంచి నిధులు తేలేకపోయారు
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.....
Minister Ponguleti : కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శించారు. కేంద్రం నుంచి సరైన నిధులు తేలేక పోయారని మండిపడ్డారు. వాస్తవాలను బీఆర్ఎస్ నేతలు ఇంకా ఒప్పుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఈరోజు(శుక్రవారం) కరీంనగర్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు.
Minister Ponguleti Comment
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ను వారే కూల్చుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తాము గులాబీ పార్టీ లాగా గొప్పలకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ధనిక తెలంగాణను గత సర్కార్ అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాప్, ఇరిగేషన్, కరెంట్‌తో అరాచకాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై ప్రతిపక్షాలు చేసే విమర్శలు నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులను ఆందోళనకు గురిచేసేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుటుంబ నిర్దారణకు మాత్రమే రేషన్ కార్డు ప్రమాణికమని తెలిపారు. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు పేరుతో ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని అన్నారు.
కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డులు వేర్వేరుగా ఇస్తామని తెలిపారు. ఒకదానితో ఒకటి లింక్ పెట్టబోమని అన్నారు. కొత్త రేషన్ కార్డులకు మార్గదర్శకాలు ఆలోచిస్తున్నామని వివరించారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. తాము రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించారు.కేసీఆర్ చేసింది పదేళల్లో 25 వేల కోట్ల రుణమాఫీ మాత్రమేనని అన్నారు.
Also Read : Ex CM YS Jagan Letter : ప్రధాని అపాయింట్ మెంట్ లేఖ రాసిన ఏపీ మాజీ సీఎం