Minister Ponnam : బోనాలకు ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన మంత్రి పొన్నం

అన్ని ఆలయాలకు రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించాలి...

Minister Ponnam : బోనాల పండుగకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని ఎంహెచ్‌ఆర్‌డీలో ఆర్థిక మంత్రి కొండా సురేఖతో కలిసి ఆషాఢ మాసంలో జంటనగరాల బోనాల జాతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో తాగునీటి వసతి గృహాలు, మొబైల్ టాయిలెట్లు, ప్రత్యేక అంబులెన్స్‌లతో కూడిన ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Minister Ponnam Comment

అన్ని ఆలయాలకు రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించాలి. ప్రతి ఆలయ ప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. బక్రీద్‌కు కూడా అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Also Read : Virat Kohli : టీ20లో బ్యాటింగ్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ

Leave A Reply

Your Email Id will not be published!