Minister Ponnam : ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా ప్రత్యక్షమైన మంత్రి పొన్నం..
ఈ సందర్భంగా మంత్రి బస్సులో కొద్దిసేపు ప్రయాణికులతో ముచ్చటించారు
Minister Ponnam : తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మంత్రి బస్సులో కనిపించడంతో కండక్టర్, డ్రైవర్, ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. మంత్రి పొన్నం ఆదివారం అనూహ్యంగా హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు ఆర్టీసీ బస్సులో వెళ్లారు.
Minister Ponnam Prabhakar Travelled in RTC
ఈ సందర్భంగా మంత్రి బస్సులో కొద్దిసేపు ప్రయాణికులతో ముచ్చటించారు. బస్సు ప్రయాణికుల సమస్యపై నారాయణ పెట్ బస్సులో ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నందిగామ నుంచి షాద్‌నగర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంతోపాటు దేవరఖద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా బస్సులో ప్రయాణించారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాలు, ప్రయాణంలో పొదుపు తదితర అంశాలపై బస్సులో ఉన్న మహిళలను మంత్రి(Minister) అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 90 రోజుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఆర్టీసీ, ఆరోగ్యం,రూ. 10 లక్షల రూపాయల నుండి రూ. 500కె గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పారు.
ఈ నెలలో ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి(Minister Ponnam) ప్రయాణికులకు తెలియజేశారు. ఈ క్రమంలో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా… త్వరలో మరో 1000 కొత్త బస్సులు వస్తాయని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి హామీ ఇచ్చారు. ఇక ఆర్టీసీ కండక్టర్ తన సమస్యను మంత్రి వద్దకు చెప్పగా… ఒకవైపు బాండ్స్ అమలు అవుతున్నాయని..త్వరలోనే పీఆర్సీ అమలుపై చర్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ బదులిచ్చారు.
Also Read : PM Modi : కేంద్ర పూర్తిస్థాయి కేబినెట్ తో మంత్రివర్గ సమావేశానికి హాజరైన మోదీ..